Botsa Satyanarayana : లోకేష్ అమిత్ షాను కలిస్తే మాకేంటి,అమితాబ్ బచ్చన్‌ను కలిస్తే మాకేంటి : బొత్స సత్యనారాయణ

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..26 నుంచి 175 నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని తెలిపారు.

Botsa Satyanarayana : లోకేష్ అమిత్ షాను కలిస్తే మాకేంటి,అమితాబ్ బచ్చన్‌ను కలిస్తే మాకేంటి : బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana

Botsa Satyanarayana : విశాఖపట్నంలో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..26 నుంచి 175 నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని..ఈ యాత్రలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రతిపక్షాలు చేసిన అవినీతిని ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రానికి మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కావాలని ప్రజలకు వివరాస్తామన్నారు. మూడు విడతలుగా బస్సు యాత్రలు నిర్వహిస్తామని వెల్లడించారు.

26వ తేదిన ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుందని…ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు 13రోజులు మొదటి దశలో యాత్ర ఉంటుందన్నారు.
ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అవసరమో తెలియజేస్తామన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని పెట్టాలని నిర్ణయించామని..ఈ రోజు నుంచే పరిపాలన చేయ్యాలని కోరుకుంటున్నానని అన్నారు. అతి త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని తెలిపారు. స్థానికులు ఎవ్వరు రాజధాని వద్దని చెప్పటంలేదని..గంటా ఎక్కడి వ్యక్తి..ాయనకు మాబాధ ఎలా తెలుస్తుంది అంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాస్ ను విమర్శించారు.

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై నమ్మకం లేదు,చంద్రబాబుకు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలి : అచ్చెన్నాయుడు

మరోసారి మా ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తంచేసిన మంత్రి బొత్స నిబంధనలు ప్రకారమే జైలులో చంద్రబాబుకు టెస్ట్ లు జరుగుతున్నాయని అన్నారు.వ్యక్తిగతంగా దూషించడం రాజకీయ సంప్రదాయం కాదన్నారు. పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించలేదు సంప్రదాయాలు గురించి వివరించారు. ఈ సందర్బంగా లోకేశ్ కేంద్రమంత్రి అమిత్ షాను కలిసి విషయాన్ని ప్రస్తావిస్తు..లోకేష్ అమిత్ షా కలిస్తే మాకేంటి… అమితాబ్ బచ్చన్ ను కలిస్తే మాకేంటి…అంటూ సెటైర్లు వేశారు.

కాగా..వైసీపీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని ఇటీవల వైసీపీ నేతల సమావేశంలో సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమరంలో భాగంగా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధినేత నిర్ణయించారు. అదే విషయం నేతలకు సమావేశంలో వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేపట్టాలని ఆదేశించారు. దసరా తర్వాత బస్సు యాత్రలు మొదలుపెట్టాలని, ప్రతీ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం చేసిన సంక్షేమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు.