War 2 : స్పెయిన్‌లో వార్ 2 మొదటి షెడ్యూల్ కంప్లీట్.. హృతిక్, ఎన్టీఆర్ డూపులతో యాక్షన్ సీక్వెన్స్..
స్పెయిన్‌లో మొదలైన వార్ 2 మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. హృతిక్, ఎన్టీఆర్ డూపులతో దర్శకుడు యాక్షన్ సీక్వెన్స్..
![War 2 : స్పెయిన్‌లో వార్ 2 మొదటి షెడ్యూల్ కంప్లీట్.. హృతిక్, ఎన్టీఆర్ డూపులతో యాక్షన్ సీక్వెన్స్.. War 2 : స్పెయిన్‌లో వార్ 2 మొదటి షెడ్యూల్ కంప్లీట్.. హృతిక్, ఎన్టీఆర్ డూపులతో యాక్షన్ సీక్వెన్స్..](https://10tv.in/wp-content/uploads/2023/10/Hrithik-Roshan-NTR-war-2-first-schedule-at-spain-is-completed.jpg)
Hrithik Roshan NTR war 2 first schedule at spain is completed
War 2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. హృతిక్, ఎన్టీఆర్ లేకుండానే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. స్పెయిన్ లో మొదటి షెడ్యూల్ ని ప్లాన్ చేశాడు. లాస్ట్ వీక్ స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంది. అక్కడ ఒక సూపర్ కారు ఛేజింగ్ సీక్వెన్స్ ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఈరోజుతో అక్కడి షెడ్యూల్ కి గుమ్మడికాయ కొట్టేశారట. దీంతో మొదటి షెడ్యూల్ హృతిక్, ఎన్టీఆర్ లేకుండానే జరిగిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండడంతో దర్శకుడు.. హృతిక్, ఎన్టీఆర్ డూపులతో మొత్తం కారు ఛేజింగ్ సీక్వెన్స్ ని పూర్తి చేసేశాడట. మరి సెకండ్ షెడ్యూల్ కూడా అక్కడే జరుగనుందా..? ఆ షెడ్యూల్ లో అయిన హృతిక్, ఎన్టీఆర్ పాల్గొంటారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ మూవీ హీరోయిన్ గా కియారా అద్వానీ నటించబోతుంది. యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also read : Keeda Cola : ప్రమోషన్స్‌తోనే కామెడీ పుట్టిస్తున్న తరుణ్ భాస్కర్.. కీడా కోలా మూవీ పోస్టర్స్ చూశారా..?
#WAR2 first schedule wrapped in Spain.
Huge action sequence part as been shooted in this schedule. #NTR #JrNTR #HrithikRoshan pic.twitter.com/IcdWSM9SgW
— Indian Cinema Hub (@IndianCinemaHub) October 25, 2023
2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘వార్ 1’ మంచి విజయం సాదించడం, స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుండడంతో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఈ మూవీకి ఎప్పుడు కాల్ షీట్స్ ఇవ్వబోతున్నాడు..? ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు..? అనే విషయాలు పై ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకుంది.