Ranveer Deepika : నిశ్చితార్థం చేసుకొని మూడేళ్లు సీక్రెట్ గా.. కాఫీ విత్ కరణ్ లో బోలెడన్ని సీక్రెట్స్ చెప్పిన దీపికా రణవీర్..

షోలో బోలెడన్ని ఆసక్తికర విషయాలు తమ సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి, మ్యారేజ్ గురించి తెలిపారు దీపికా రణవీర్. దీంతో కాఫీ విత్ కరణ్ షో ఇప్పుడు వైరల్ గా మారింది.

Ranveer Deepika : నిశ్చితార్థం చేసుకొని మూడేళ్లు సీక్రెట్ గా.. కాఫీ విత్ కరణ్ లో బోలెడన్ని సీక్రెట్స్ చెప్పిన దీపికా రణవీర్..

Ranveer Singh Deepika Padukone Shares so Many Interesting matters in Koffee with Karan Show

Ranveer Deepika : బాలీవుడ్(Bollywood) హిట్ షో కాఫీ విత్ కరణ్(Koffee with Karan) తాజాగా 8వ సీజన్ మొదలవ్వనుంది. 7వ సీజన్ లో సౌత్ స్టార్స్ కూడా వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. సీజన్ 8 మొదలవ్వగా మొదటి ఎపిసోడ్ ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కి రణవీర్ సింగ్, దీపికా పదుకొనే వచ్చి సందడి చేశారు. ఈ ఇద్దరూ ఫుల్ యాక్టివ్ గా, సరదాగా, రొమాంటిక్ గా ఉన్నారు. షోలో బోలెడన్ని ఆసక్తికర విషయాలు తమ సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి, మ్యారేజ్ గురించి తెలిపారు. దీంతో కాఫీ విత్ కరణ్ షో ఇప్పుడు వైరల్ గా మారింది.

రణవీర్ సింగ్ ఒక రింగ్ కొనుక్కొని మాల్దీవ్స్(Mladives) లో దీపికా పదుకొనేకి 2012లో ప్రపోజ్ చేసాడట. అప్పటికే దీపికా పదుకొనే బ్రేకప్ అయి ఉండటంతో కొన్ని రోజుల తర్వాత దీపికా ఇండైరెక్ట్ గా ఓకే చెప్పి కొన్ని రోజులు డేటింగ్ చేస్తూ ట్రావెల్ చేద్దాం అనుకుంది. దీంతో మూడేళ్లు దీపికా రణవీర్ డేటింగ్ చేసిన తర్వాత రణవీర్ నిశ్చితార్థం చేసుకుందామని అడగడంతో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా 2015లో నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట.

అప్పటికి వీళ్ళ రిలేషన్ గురించి ఎవ్వరికి తెలీదంట. తమ రిలేషన్ బయటకి తెలిశాక నిశ్చితార్థం జరిగిన మూడేళ్ళ తర్వాత 2018లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. దీంతో 6 ఏళ్ళ ప్రేమ తర్వాత దీపికా రణవీర్ వివాహం చేసుకున్నామని తెలిపారు.

Also Read : Anirudh Ravichander : అనిరుధ్ ఏం చదువుకున్నాడో తెలుసా? అందుకేనా ఇంత బాగా మ్యూజిక్ ఇస్తున్నాడు..

అలాగే వీరిద్దరూ రిలేషన్ లోకి వెళ్లే ముందు ఇద్దరికీ కొన్ని బ్రేకప్ స్టోరీలు ఉన్నాయని, వాటి నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది అని తెలిపారు. దీపికా అయితే ఒకానొక సమయంలో లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోవాలని అనుకుందట, కానీ రణవీర్ తన మైండ్ సెట్ ని మార్చేశాడు అని చెప్పింది. అలాగే పెళ్ళికి ముందు వీళ్ళ పాస్ట్ స్టోరీస్, హెల్త్ కండిషన్స్, డబ్బులు, సినిమాలు అన్నిటి గురించి చర్చించుకున్నారట. ఇలా దీపికా రణవీర్ తమ గురించి బోలెడన్ని విషయాలు కాఫీ విత్ కరణ్ షోలో తెలిపారు.