ODI World Cup 2023 : పాకిస్థాన్ సెమీస్ దారులు మూసుకుపోలేదా..? ఇంకా అవ‌కాశం ఉందా..? ఎలాగో తెలుసా..?

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవ‌రెట్ల‌లో పాకిస్థాన్ జ‌ట్టును ప‌రిగ‌ణించారు.

ODI World Cup 2023 : పాకిస్థాన్ సెమీస్ దారులు మూసుకుపోలేదా..? ఇంకా అవ‌కాశం ఉందా..? ఎలాగో తెలుసా..?

Pakistan still not out of semifinals race

Pakistan ODI World Cup 2023 : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవ‌రెట్ల‌లో పాకిస్థాన్ జ‌ట్టును ప‌రిగ‌ణించారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే పాకిస్థాన్ జ‌ట్టు కూడా మొద‌టి రెండు మ్యాచుల్లో విజ‌యాలు సాధించింది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా ఈ రెండు మ్యాచులు జ‌రిగాయి. మొద‌టి మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్ తో త‌ల‌ప‌డిన పాక్ 81 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. రెండ‌వ మ్యాచ్‌లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో మట్టి క‌రిపించింది.

భార‌త్ చేతిలో ఓడిపోవ‌డం నుంచి..

ఇక మూడో మ్యాచ్‌లో ఆతిథ్య టీమ్ఇండియాతో త‌ల‌ప‌డింది పాకిస్థాన్. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు గెలుపొందింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో పాకిస్థాన్ పై భార‌త్‌కు ఇది వ‌రుస‌గా ఎనిమిదో విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మ్యాచ్ నుంచి పాకిస్థాన్ త‌ల‌రాత మారింది. భార‌త్ చేతిలో ఓడిన త‌రువాత నుంచి గెలుపు అన్న సంగ‌తే పాక్ మ‌రిచిపోయింది. బెంగ‌ళూరులో ఆస్ట్రేలియా చేతిలో 62 ప‌రుగులు ఓడిన బాబర్ సేన‌.. ఆ త‌రువాత ప‌సికూన ఆఫ్గానిస్థాన్ పై ఘోర అవ‌మానాన్ని మూట‌గ‌ట్టుకుంది.

ODI World Cup 2023 : కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన‌ డేవిడ్ వార్న‌ర్‌.. ఏ రికార్డో తెలుసా..?

చెన్నైలోని చెపాక్ మైదానంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో పాకిస్థాన్ సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఈ క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికాతో త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లోనూ ఆఖ‌రి వ‌ర‌కు పాకిస్థాన్ పోరాడినా గెలుపు స‌ఫారీల‌ను వ‌రించింది. దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ వ‌రుస‌గా నాలుగో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. దీంతో పాకిస్థాన్ సెమీస్ అవ‌కాశాలు మ‌రింత సంక్లిష్టం అయ్యాయి.

పాక్ సెమీస్‌కు చేరే ఛాన్స్ ఉందా..!

పాకిస్థాన్ సాంకేతికంగా ఇంకా సెమీస్ రేసులోనే ఉంది. అయితే.. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే పాకిస్థాన్ నేరుగా సెమీస్‌కు చేరే అవ‌కాశాలు లేవు. కానీ మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల ఆధార‌ప‌డి ఉంది. అయితే.. అందుకు చాలా స‌మీక‌ర‌ణాలు పాక్‌కు స‌హ‌క‌రించాల్సి ఉంటుంది. ముందుగా ఈ టోర్నీలో పాకిస్థాన్ మ‌రో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచుల్లో పాకిస్థాన్ భారీ ర‌న్‌రేట్‌తో గెల‌వాల్సి ఉంటుంది. అప్పుడు పాకిస్థాన్ ఖాతాలో 10 పాయింట్లు వ‌చ్చి చేరుతాయి.

ఇత‌ర జ‌ట్లు ఓడిపోతే..

ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో 10 పాయింట్ల‌తో సౌతాఫ్రికా, భార‌త జ‌ట్లు మొద‌టి రెండు స్థానాల్లో కొన‌సాగుతున్నాయి. ఈ రెండు జ‌ట్లు త‌మ మిగిలిన మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఈజీగా సెమీస్‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో న్యూజిలాండ్ (8), ఆస్ట్రేలియా (6) ల‌ గెలుపోట‌ముల‌పైనే పాకిస్థాన్ ఎక్కువ‌గా ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో న్యూజిలాండ్ మిగిలిన అన్నీ మ్యాచుల్లో ఓడిపోవాలి.. అప్పుడు ఆ జ‌ట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉంటాయి. అదే స‌మ‌యంలో పాకిస్థాన్ మిగిలిన అన్ని మ్యాచుల్లో గెల‌వాల్సి ఉంటుంది. అప్పుడు పాక్ ఈజీగా సెమీస్ వెలుతుంది.

ODI World Cup 2023 : పాక్ జట్టుకు మద్దతుగా నిలిచిన హర్భజన్ సింగ్.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కౌంటర్.. అలా ఎందుకంటే?

మ‌రో వైపు ఆస్ట్రేలియా మిగిలిన నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచులు ఓడిపోతే కూడా పాకిస్థాన్ సెమీస్ కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. ఇలా కాకుండా ఆస్ట్రేలియా త‌మ మిగిలిన మ్యాచుల్లో రెండు గెలిచినా కూడా పాకిస్థాన్ ర‌న్‌రేట్ ఆధారంగా సెమీస్‌కు చేర‌వ‌చ్చు. అలా కాకుండా ఆస్ట్రేలియా మిగిలిన మ్యాచుల్లో మూడు, న్యూజిలాండ్ రెండు మ్యాచుల్లో విజ‌యాలు సాధిస్తే మాత్రం పాకిస్థాన్ మెగాటోర్నీ నుంచి ఇంటి బాట‌ప‌ట్టాల్సిందే. రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతోందో వేచి చూడాల్సిందే మ‌రీ.