Cyclone Mythili : తీరందాటిన మిథిలి.. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం

మిథిలి తుఫాను బంగ్లాదేశ్‌లోని ఖెపుపరా తీరాన్ని తాకడంతో అక్కడి తీర ప్రాంతాల్లో 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీలోని పలు ప్రాంతాల్లో ...

Cyclone Mythili : తీరందాటిన మిథిలి.. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం

Cyclone Mythili

Cyclone Mythili Update : బంగాళాఖాతంలో తుఫానుగా మారిన అల్పపీడనానికి మిథిలి అని పేరు పెట్టారు. శుక్రవారం ఉదయం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఇది.. సాయంత్రానికి బంగ్లాదేశ్‌లోని ఖెపువరా తీరాన్ని తాకింది. తుఫానుగా తీరం దాటిన మిథిలి .. తీవ్ర వాయుగుండంగా మారి శనివారం నాటికి బలహీనపడనుంది. తిరిగి వాయుగుండంగా మారనున్న ఈ తుఫాన్ వల్ల పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read : Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, దంపతుల మృతి, 18 మందికి గాయాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారింది. మిథిలి తుఫాను బంగ్లాదేశ్‌లోని ఖెపుపరా తీరాన్ని తాకడంతో అక్కడి తీర ప్రాంతాల్లో 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం శనివారం నాటికి బలహీన పడి వాయుగుండంగా మారనుంది. తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : Telangana BJP Manifesto 2023 : బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్న కేంద్ర మంత్రి అమిత్ షా.. కీలక హామీలు ఇవే..

అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వచ్చే 48 గంటల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్నింటికి ఎల్లో అలర్జ్ జారీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని గంగా పరీవాహక ప్రాంతాల్లోని కొన్నిచోట్ల వచ్చే 24 గంటల్లో ఆకస్మిక వరదల ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల తీర ప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.