Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, దంపతుల మృతి, 18 మందికి గాయాలు

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం బలమైన భూకంపం సంభవించడంతో పలు భవనాలు కూలిపోయాయి. ఒక మాల్ పైకప్పు కూలిపోవడంతో అందులోని కస్టమర్లు బయటకు పరుగులు తీశారు....

Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, దంపతుల మృతి, 18 మందికి గాయాలు

Earthquake

Updated On : November 18, 2023 / 10:06 AM IST

Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం బలమైన భూకంపం సంభవించడంతో పలు భవనాలు కూలిపోయాయి. ఒక మాల్ పైకప్పు కూలిపోవడంతో అందులోని కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఈ భూకంపం వల్ల మాల్ ఫాల్స్ సీలింగ్ కూలిపోవడంతో దంపతులు మృతి చెందారు.

ALSO READ : Cricketer Mohammed Shami : షమి స్వగ్రామం సాహస్‌పూర్ అలీనగర్‌కు మహర్దశ…యూపీ సర్కారు కొత్త ప్రతిపాదనలు

ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపం వల్ల మరో 18 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్పారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న తీరప్రాంత పట్టణం గ్లాన్‌లోని మున్సిపల్ కార్యాలయ భవనం, వ్యాయామశాల దెబ్బతిన్నాయి.

ALSO READ : Telangana Assembly Elections 2023 : తెలంగాణ సరిహద్దు అసెంబ్లీ సెగ్మెంట్లలో పొరుగు రాష్ట్రాల ప్రభావం…పొరుగు నేతల ప్రచారం

భూ ప్రకంపనల కారణంగా మాల్‌లోని సీలింగ్‌లో భాగం పడిపోవడంతో ప్రజలు అరుస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు చూపించాయి. ఈ ప్రాంతంలో భూప్రకంపనలు రావడంతో ప్రజలు బయటకు పరుగులు తీయడం కనిపించింది. ఇటీవల పలు దేశాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఫిలిప్పీన్స్, అప్ఘానిస్థాన్, పాకిస్తాన్, భారతదేశం, నేపాల్, టర్కీ ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి.

ALSO READ : Telangana Assembly Elections 2023 : వలస ఓటర్లపై రాజకీయ పార్టీల దృష్టి…ఇతర రాష్ట్రాల నుంచి పోలింగుకు తీసుకువచ్చేందుకు అభ్యర్థుల యత్నాలు