Chinna : సిద్దార్థ్ లేటెస్ట్ హిట్ సినిమా ‘చిన్నా’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

'చిన్నా' సినిమా చిన్న పిల్లల పై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Chinna : సిద్దార్థ్ లేటెస్ట్ హిట్ సినిమా ‘చిన్నా’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

Siddharth Chinna Movie OTT Releasing Date Announced

Chinna Movie : సిద్దార్థ్ (Siddharth) హీరోగా అరుణ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘చిన్నా’. నిమిషా సజయన్, బేబీ సహస్ర శ్రీ ముఖ్యపాత్రలో నటించారు. తమిళ్ లో చిత్తా అనే పేరుతో రిలీజయిన ఈ సినిమా ఆ తర్వాత అన్ని భాషల్లోనూ రిలీజయింది. తెలుగులో చిన్నా అనే పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ అయింది. ఈ సినిమాని సిద్దార్థ్ స్వయంగా నిర్మించారు.

‘చిన్నా’ సినిమా చిన్న పిల్లల పై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా మంచి విజయం సాధించింది. సిద్దార్థ్, బేబీ సహస్ర సినిమాలో తమ నటనతో కన్నీళ్లు పెట్టిస్తారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

Also Read : Movie Reviews : మీడియా వర్సెస్ నిర్మాతలు.. సినిమా రివ్యూలపై చర్చలు.. దిల్ రాజు సవాల్..

చిన్నా సినిమా నవంబర్ 28 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో ఈ సినిమా థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూడటానికి సిద్ధమయ్యారు. ఇలాంటి మంచి సినిమాని కచ్చితంగా పేరెంట్స్ చూడాలి.

View this post on Instagram

A post shared by Siddharth (@worldofsiddharth)