Telangana Assembly Election 2023 : తెలంగాణలో చోటామోటా నేతల కొనుగోలుకు అభ్యర్థుల వ్యూహాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులందరి చూపు ఓట్ల కొనుగోలుపై ఉంది. అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఛోటామోటా నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఓట్లు సాధించేందుకు యత్నిస్తున్నారు.....

Telangana Assembly Election 2023 : తెలంగాణలో చోటామోటా నేతల కొనుగోలుకు అభ్యర్థుల వ్యూహాలు

cash

Telangana Assembly Election 2023 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులందరి చూపు ఓట్ల కొనుగోలుపై ఉంది. అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఛోటామోటా నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఓట్లు సాధించేందుకు యత్నిస్తున్నారు. ఒక వైపు తమ పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే మరో వైపు ప్రత్యర్థి పక్షం వైపు నుంచి ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

గంపగుత్తగా ఓట్ల కొనుగోలుకు వ్యూహాలు

ప్రత్యర్థి పక్షాలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు బలంగా ఉన్న చోట వారిని తమ వైపు తిప్పుకొని పార్టీ కండువా కప్పేందుకు యత్నిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా వారి అనుచరుల ఓట్లను గంపగుత్తగా పొందాలని చూస్తున్నారు. కులాలు, మతాల వారీగా ఛోటామోటా నేతలు, గల్లీ, బస్తీ లీడర్లు, సంక్షేమ సంఘాల ప్రతినిధులను ఆకట్టుకునేందుకు వారికి అభ్యర్థులు వివిధ రకాల బహుమతులు ఇస్తున్నారు.

కార్లు, ఇళ్ల స్థలాలే నజారానాలుగా…

కొందరు అభ్యర్థులు ద్వితీయ శ్రేణి నేతలకు పొలాలు, స్థలాలు, కార్లు, పెద్ద మొత్తంలో నగదు బహుమతులు అందిస్తున్నారు. ఓ ప్రధాన రాజకీయ పార్టీలో టికెట్టు ఆశించి భంగపడిన నేతలు, అసమ్మతి నేతల మద్ధతు కోసం వారికి వివిధ రకాలుగా ప్రలోభ పెట్టారని సమాచారం. ఓ అభ్యర్థి తమ పార్టీకి చెందిన బలమైన నాయకుడి మద్ధతు కోసం తనకున్న వ్యవసాయ భూమిని రాసిచ్చారని అంటున్నారు. ఓ అభ్యర్థి తనకు మద్ధతు ఇస్తున్న ద్వితీయ శ్రేణి నేతలైన సర్పంచులు, కార్పొరేటర్లకు కొత్త కార్లను బహుమతిగా ఇచ్చేందుకు కార్ల షోరూంలో ఆర్డర్ పెట్టారని సమాచారం.

కార్ల కొనుగోలుకు డౌన్ పేమెంట్లు

పోలింగ్ ముగిశాక కొత్త కార్లు పంపిస్తామని అభ్యర్థులు హామీలిచ్చారు. దీనికోసం కార్ల కొనుగోలుకు అభ్యర్థులు 25 శాతం మొత్తాన్ని డౌన్ పేమెంటు కూడా చేశారని కార్యకర్తులు చెబుతున్నారు. బడా నేతల నుంచి గల్లీ, గ్రామ స్థాయి లీడర్ల దాకా వారి స్థాయిని బట్టి అభ్యర్థులు నజారానాలు ప్రకటిస్తున్నారు. అభ్యర్థులు ఇచ్చే నజారానాలతో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు రాత్రికి రాత్రి కండువాలు మారుస్తున్నారు. ఎవరు ఆర్థికంగా ఆదుకుంటారో వారికే తమ మద్ధతు అని ద్వితీయ శ్రేణి నేతలు ప్రకటిస్తున్నారు.

ద్వితీయశ్రేణి నేతల బేరసారాలు

కొందరు ద్వితీయ శ్రేణి నేతలు తమ చేతిలో రెండు వేల ఓట్లు ఉన్నాయని , గంపగుత్తగా 2వేల ఓట్లను వేయిస్తానని చెప్పి అభ్యర్థితో బేరసారాలు ఆడుతున్నారు. హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్లకు ఓ పార్టీ అభ్యర్థి రూ.50 లక్షల చొప్పున నగదును ఎన్నికల షెడ్యూల్ ఖరారుకు ముందే పంపిణీ చేశారని సమాచారం. పార్టీలో ఎవరైనా ద్వితీయ శ్రేణి నాయకుడు అసంతృప్తిగా ఉంటే అతని బేరం కుదుర్చుకొని డబ్బు ముట్టచెప్పడం ద్వారా వారి మద్ధతు తీసుకుంటున్నారు.

ALSO READ : Mysterious Pneumonia : చైనాలో మిస్టరీగా మారిన మరో మహమ్మారి న్యుమోనియా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

మొత్తంమీద తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఎన్నికల నిబంధనలు ఆటంకంగా మారడంతో కొందరు అభ్యర్థులు పోలింగ్ తర్వాత డబ్బు సంచులు పంపిస్తామని హామీలిస్తున్నారని సమాచారం. దీంతోపాటు పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల కొనుగోలుకు ప్రత్యేకంగా బృందాలను నియమించి ఒక్క ఓటుకు రెండు వేల రూపాయల నుంచి 5వేల రూపాయల దాకా పంపిణీ చేసేందుకు సమాయత్తమయ్యారు.

ALSO READ : Coca-Cola Tea : భారతదేశం మార్కెట్‌లో ఇక కొత్తగా కోకా కోలా టీ.. కొత్తగా ప్రారంభం

అత్యంత రహస్యంగా పోలింగ్ కేంద్రాల బాధ్యులు ఈ డబ్బు పంపిణీ చేస్తున్నారని సమాచారం. స్థిరాస్థి వ్యాపారి అయిన ఓ అభ్యర్థి ద్వితీయ శ్రేణి నేతల మద్ధతు కోసం ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలాలను పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. తాను ఎన్నికల్లో విజయం సాధించగానే కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని ఓ అభ్యర్థి హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో కీలకమైన వార్డుల కార్పొరేటర్లకు కార్లు, నగదును నజారానాలుగా అందిస్తూ వారి ద్వారా ఓట్లు పొందాలని అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారిన ప్రవాస భారతీయుల పోరు

ఎన్నికల ప్రచార పర్వంలో తమ వెంట తిరుగుతున్న ఛోటా మోటా నేతలకు రోజువారీగా ఖర్చుల కోసం 10 నుంచి 20 వేలరూపాయలు ముట్టచెబుతున్నారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు అభ్యర్థులు ఎవరికి వారు వ్యూహాలు రూపొందించుకొని డబ్బు సంచులను రంగంలోకి దించారు. దీంతో ఇటీవల పోలీసులు జరిపిన తనిఖీల్లో హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ డబ్బులు దొరికాయి.