Bigg Boss 7 Day 83 : ఆమె ఎలిమినేషన్.. మళ్ళీ బుజం నొప్పితో శివాజీ బయటకి..

ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండడంతో శనివారం ఎపిసోడ్ లోనే ఒక కంటెస్టెంట్ ని బయటకి తీసుకు వచ్చేశారు నాగార్జున. అలాగే శివాజీ బుజం నొప్పి సమస్య..

Bigg Boss 7 Day 83 : ఆమె ఎలిమినేషన్.. మళ్ళీ బుజం నొప్పితో శివాజీ బయటకి..

Bigg Boss 7 Day 83 Highlights double elimination

Bigg Boss 7 Day 83 : గత వారం ఎలిమినేషన్ ని తీసేసిన నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీక్ శోభాశెట్టి, గౌతమ్, ప్రియాంక, యావర్, రతిక, అశ్విని, అమర్, అర్జున్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేషన్ అయ్యి బయటకి రాబోతున్నారని అందరిలో ఆసక్తి నెలకుంది. నిన్న జరిగిన శనివారం ఎపిసోడ్ లోనే ఒక కంటెస్టెంట్ ని బయటకి తీసుకు వచ్చేశారు నాగార్జున. అలాగే శివాజీ బుజం నొప్పి సమస్య గురించి కూడా చర్చ జరిగింది. అసలు శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగింది..?

అమర్ డ్రామా..
శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్ కోసం జరిగిన నామినేషన్స్ తో హౌస్ లో పెద్ద డ్రామానే నడిచింది. ఈ సీజన్ లో ఇదే లాస్ట్ కెప్టెన్ హోదా అని చెప్పడంతో.. అమర్ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని ప్రతి ఒక్కర్ని బ్రతిమాలి, కన్నీరు పెట్టుకొని ఏడ్చినా లాభం లేకుండా పోయింది. ఇక ఈ విషయం గురించే నాగార్జున ప్రశించారు. గతంలో ప్రశాంత్ ఏడిస్తే అది డ్రామా అని చెప్పావు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటని నాగార్జున ప్రశించారు.

అమర్ బదులిస్తూ.. నా దగ్గరకి వస్తే గాని తెలియలేదని చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జున గత వారం కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన ఒక విషయాన్ని వీడియోగా ప్లే చేశారు. ఆ వీడియోలో అమర్ శివాజీతో మాట్లాడుతూ.. స్ట్రాటజీతో తాను ఏడుస్తునట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని చూపించిన నాగార్జున.. నీ ఏడుపు నిజామా..? అబ్దమా..? అనేది తెలియడం లేదంటూ చురకలు అంటించారు.

Also read : Mahesh Babu : మహేష్ బాబుతో సినిమా గురించి సందీప్ వంగా కామెంట్స్.. రామ్‌చరణ్‌తో కూడా..

శివాజీ బుజం నొప్పి..
శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్‌బాస్.. బుజం నొప్పి గురించి అరా తీశారు. శివాజీ ఓకే పర్వాలేదని బదులిచ్చారు. దీంతో బిగ్‌బాస్ ఒక విషయం చెప్పాడు. వచ్చే ఎపిసోడ్స్ లో కఠినమైన టాస్క్ లు ఉంటాయని, ఆ సమయంలో మీ భుజానికి ఎటువంటి ఇబ్బంది కలిగిన తమకి సంబంధం లేదని, ఒకవేళ మీరు ఆ ఇబ్బంది వద్దనుకుంటే ఇప్పుడే బయటకి వెళ్లిపోవచ్చని చెప్పాడు.

ఇక కాసేపు ఆలోచించుకున్న శివాజీ బయటకి వెళ్ళిపోతాను అంటూ తన నిర్ణయాన్ని చెప్పారు. దీంతో నాగార్జున కూడా శివాజీ మాట్లాడారు. శివాజీ మాట్లాడుతూ.. ఆట ఆడడానికి వచ్చి వంద శాతం ఎఫర్ట్ పెట్టకుండా టైటిల్ ఆశించడం కరెక్ట్ కాదని అందుకే తాను వెళ్లిపోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు నాగ్ కి తెలియజేశారు. అయితే నాగార్జున శివాజీ సర్ది చెప్పి ధైర్యం చెప్పడంతో శివాజీ హౌస్ లో కొనసాగడానికి అంగీకరించారు.

అశ్విని ఎలిమినేట్..
ఇక ఈ వారం సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న అశ్విని ఎలిమినేట్ అయ్యింది. డబుల్ ఎలిమినేషన్ ఉందని తెలిసి కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నావు.. కాన్ఫిడెన్సా..? ఓవర్ కాన్ఫిడెన్సా..? అంటూ నాగార్జున అశ్విని పై సీరియస్ అయ్యారు. ఇక అందరూ ఊహించినట్లే అశ్విని బయటకి వచ్చేసింది. ఇక ఇవాళ ఎవరు బయటకి వస్తారో చూడాలి. రతిక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.