Telangana Assembly Election 2023 : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాయ్ రాజా కాయ్ .. కామారెడ్డిపై బెట్టింగురాయుళ్ల స్పెషల్ ఫోకస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది..? ప్రధాన అభ్యర్ధులు ఎవరు గెలుస్తారు..? అనే దానిపై బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి.

Telangana Assembly Election 2023 : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాయ్ రాజా కాయ్ .. కామారెడ్డిపై బెట్టింగురాయుళ్ల స్పెషల్ ఫోకస్

Betting On Telangana Election Exit Polls

betting on telangana election results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది..? ప్రధాన అభ్యర్ధులు ఎవరు గెలుస్తారు..? అనే దానిపై బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. తెలంగాణలో హంగ్ వస్తుందంటూ పలువురు పందాలు కాసారు. మరీ ముఖ్యంగా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుస్తారని కొంతమంది..కాదు కేసీఆర్ గెలుస్తారని మరికొంతమంది బెట్టింగ్ లు నడుస్తున్నాయి.

అలాగే సిద్ధిపేటలో హరీశ్ రావు మెజారిటీ గతం కంటే ఈ ఎన్నికల్లో తగ్గుతుందని, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, కోమటిరెడ్డి బ్రదర్స్,ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లారెడ్డి సహా పలువురు నేతలు పోటీ చేస్తున్న స్థానాలపై జోరుగా బెట్టింగులు ఊపందుకున్నాయి.

గెలిచిన అభ్యర్ధులను కాపాడుకునేందుకు .. కర్ణాటక క్యాంప్ రాజకీయాలకు టీ.కాంగ్రెస్ ప్లాన్..

ఈ బెట్టింగ్ ల్లో భాగంగా రూ.లక్ష రూపాయలు పందెంలో పెడితే డబుల్ వచ్చేలా అంటే రూ. లక్షకు రూ. రెండు లక్షలు ఇచ్చేలా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికలు పోలింగ్ పూర్తి అయ్యాక సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాక బెట్టింగులు జోరందుకున్నాయి. దీని కోసం నెల రోజుల క్రితమే బెట్టింగ్ రాయుళ్లు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మకాం వేశారు.

బెట్టింగులు తెలంగాణ, హైదరాబాద్ లో నిర్వహిస్తే దొరికిపోతామనే భయంతో ఏపీలో కూర్చుని బెట్టింగ్ రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ పందాలు కాస్తున్నారు. దీని కోసం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. పలు యాప్ ల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ బెట్టింగుల నిర్వహణ జరుగుతోంది. ఈ బెట్టింగ్ లపై అనుమానాలు వచ్చిన పోలీస్ శాఖ దానిపై దృష్టి పెట్టింది.

కాగా..ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తెలంగాణ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ హవా అనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఆ పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. దీని కోసం ఇప్పటినుంచి గెలిచాక తమ అభ్యర్ధులను జాగ్రత్త చేసుకునే పనిలో పడింది. దీని కోసం కర్ణాటక క్యాంప్ రాజకీయాల ప్లాన్ లో టీకాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.