Nandigam Suresh : జగన్‌ని భయపెట్టే దమ్ము ధైర్యం దేశంలో ఎవరికీ లేదు- ఎంపీ నందిగం సురేశ్

పవన్ కల్యాణ్ కు 8 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. కొత్తగా పోటీ చేసిన మహిళకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని విమర్శించారు.

Nandigam Suresh : జగన్‌ని భయపెట్టే దమ్ము ధైర్యం దేశంలో ఎవరికీ లేదు- ఎంపీ నందిగం సురేశ్

Nandigam Suresh Slams Chandrababu (Photo : Facebook)

జగన్ ని భయపెట్టే దమ్ము ధైర్యం దేశంలో ఎవరికీ లేదన్నారు వైసీపీ ఎంపీ నందిగం సురేశ్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో ఎంపీ నందిగం సురేశ్ పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకునే అలవాటు చంద్రబాబుకి ఉందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు 8 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదన్నారు. కొత్తగా పోటీ చేసిన మహిళకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని విమర్శించారు.

జగన్ ని దించుతామని, భయపెడతామని, అండమాన్ కు పంపుతామంటున్నారు.. జగన్ ని భయపట్టే దమ్ము, ధైర్యం దేశంలో ఎవరికీ లేదన్నారు ఎంపీ నందిగం సురేశ్. లోకేశ్ తన రెడ్ బుక్ లో ఎవరి పేరు రాసుకున్నారో తెలియదన్నారు. కానీ ప్రజలంతా నీ పేరు, నీ తండ్రి పేరు, పవన్ కల్యాణ్ పేరు రాసుకున్నారు అని వ్యాఖ్యానించారు.

Also Read : రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది : జేసీ ప్రభాకర్ రెడ్డి

రాప్తాడులో ప్రతిపక్షం ఉందా లేదా అని అనుమానం కలుగుతోందన్నారు. ఎందుకంటే ఇక్కడ రక్తపాతం లేదు, గొడవలు లేవు అని అన్నారు. ఇక్కడ శాంతియుత వాతావరణం ఉంది, పోలీసులు స్వేచ్ఛగా పని చేస్తున్నారు అని పేర్కొన్నారు. రాప్తాడులో రక్తపు చుక్క పడకుండా ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పాలన చేస్తున్నారని కితాబిచ్చారు ఎంపీ సురేశ్. ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడులో అంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు- మంత్రి గుమ్మనూరు జయరాం
చంద్రబాబు భవిష్యత్ కే గ్యారెంటీ లేదు. వారి కార్యకర్తలకు ష్యూరిటీ లేదు. జనసేనకే గ్యారెంటీ లేదు. ఇక చంద్రబాబుకు ఏం ఇస్తావ్ పవన్ కల్యాణ్? తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. ఎవడికో పుట్టిని బిడ్డకు నేను తండ్రి అని ముద్దులాడుతున్నారు.

మరోసారి జగన్ ని సీఎం చేద్దాం- ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు. ఆయనే ష్యూరిటీపై బయటకొచ్చారు. ప్రజల సొమ్మును దోపిడీ చేశారు కాబట్టే జైలుకెళ్లారు. నాకు ఆరోగ్యం బాగోలేదు. కళ్లలో శుక్లాలు వచ్చాయని చెప్పి బయటకొచ్చారు. ఈ నాలుగన్నరేళ్లలో రాప్తాడుకు ఎంతో చేశాం. తెలంగాణలో సైకిల్ పంక్చర్ అయ్యింది. గ్లాస్ పగిలింది. జగన్ ఎవరికీ భయపడడు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఆయన వెంటే ఉన్నారు. 23,400 ఇళ్లు ఇస్తే.. 18వేలు ఇళ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలవే. ప్రతి ఊరిలో ఇళ్ల నిర్మాణం జరక్కుండా పరిటాల కుటుంబం స్టేలు తీసుకొచ్చింది.

Also Read : తెలంగాణలో విజయం ఏపీ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వ్యూహ రచన

ఎస్కే యూనివర్సిటీకి ఆనుకుని ఉన్న భూమిలో 5 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అది యూనివర్సిటీ భూమి అని టీడీపీ, సీపీఐ నేతలు కంచె తొలగించారు. పరిటాల కుటుంబానికి చెందిన ఎస్కేసీ కంపెనీ ఉంది. కంపెనీ వాళ్లే చాలా గ్రామాలకు రోడ్లు వేయనివ్వకుండా చేస్తున్నారు. జగన్ ని మరోసారి గెలిపిద్దాం. లక్ష ఎకరాలకు నీరు ఇద్దాం. పీఏబీఆర్ నుంచి ప్రతి ఇంటికీ తాగునీరు అందిద్దాం. జగన్ సీఎంగా ఉంటే రాప్తాడులో నీరు పారుతుంది. ఏ పార్టీ వారైనా ఆరుబయట ప్రశాంతంగా మంచం వేసి పడుకోవచ్చు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క మేలు- ఎంపీ గోరంట్ల మాధవ్
తెలంగాణలో ఏదో చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెళ్లారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క మేలు. ప్రత్యేక హోదాను అమ్మేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. గత పాలనలో ఇక్కడ బాంబులు, తుపాకుల శబ్దాలు వినిపించాయి. ఎన్నో హత్యలు జరిగాయి. దాడులు చేశారు. ప్రకాశ్ రెడ్డి పాలనలో చీమకు కూడా హాని కలగలేదు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా పోలీసులు వచ్చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచిన వ్యక్తి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి. తప్పు చేస్తే సొంత పార్టీ వారిని కూడా శిక్షించాలని చెప్పారు. గత పాలనకు ఈ పాలనకు తేడాను గుర్తించండి.