IND vs AUS : అంపైర్ల తప్పిదాల వ‌ల్ల‌నే టీమ్ఇండియా గెలిచిందా..?

India vs Australia : బెంగ‌ళూరు వేదిక‌గా ఆదివారం జ‌రిగిన ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా ఆరు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

IND vs AUS : అంపైర్ల తప్పిదాల వ‌ల్ల‌నే టీమ్ఇండియా గెలిచిందా..?

Matthew Hayden blames umpires

అంపైర్ల తప్పిదాల వ‌ల్ల‌నే భార‌త్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచులో ఆస్ట్రేలియా ఓడిపోయిందని ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాడు మాథ్యూ హెడెన్ అన్నాడు. బెంగ‌ళూరు వేదిక‌గా ఆదివారం జ‌రిగిన ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా ఆరు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో టీ20 సిరీస్‌ను 4-1తో కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌..

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజ‌యం సాధించాలంటే ఆఖ‌రి ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు చేయాల్సి ఉంది. చివ‌రి ఓవ‌ర్‌ను భార‌త పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. ఆసీస్ కెప్టెన్ మాథ్యూవేడ్ స్ట్రైకింగ్‌లో ఉండ‌గా మొద‌టి బంతిని బౌన్స‌ర్ గా వేశాడు. ఆ బంతి వేడ్ త‌ల మీదుగా వెళ్లింది. దీంతో ఆ బంతిని వైడ్‌గా ప్ర‌క‌టిస్తార‌ని అత‌డు భావించాడు. అయితే స్క్వేర్ లెగ్ అంపైర్ దాన్ని వైడ్‌గా ప్ర‌క‌టించ‌లేదు. దీనిపై వేడ్ త‌న అసంతృప్తిని అప్పుడే వ్య‌క్తం చేశాడు.

Bizarre way dismissal : టీ20 లీగ్​లో వింత ఘటన.. ఇంత‌టి దుర‌దృష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండరేమో..!

ఆ స‌మ‌యంలో కామెంట‌రీ బాక్స్‌లో ఉన్న హెడేన్ అంపైర్‌ను త‌ప్పుబ‌ట్టాడు. అది త‌ల‌పై నుంచి వెళ్లింది. అత‌డు క్రీజులో నిల‌బ‌డి ఉన్నాడు. అయినా కూడా త‌ల‌పై నుంచే బంతి వెళ్లింది అని హెడెన్ అన్నాడు. ఇక ఇదే ఓవ‌ర్‌లో ఐదో బంతిని నాథ‌న్ ఎల్లిస్ ఎదుర్కొన్నాడు. అప్ప‌టికి విజ‌య‌స‌మీక‌ర‌ణం రెండు బంతుల్లో 9 ప‌రుగులు గా ఉంది. ఐదో బంతిని ఎల్లిస్ స్ట్రైట్ షాట్ ఆడాడు. అర్ష్‌దీప్ ఆపేందుకు ప్ర‌య‌త్నించ‌గా అత‌డి చేతి తాకుతూ వెళ్లిన బంతి అంపైర్ వీరేంద‌ర్ శ‌ర్మ‌ను బ‌లంగా తాకింది. అంపైర్ ప‌క్క‌కు జ‌రిగే ప్ర‌య‌త్నం చేసిన అర్ష్‌దీప్ చేయి త‌గ‌ల‌డంతో అత‌డి ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు.

ఒక‌వేళ ఆ బంతి అంపైర్‌కు త‌గ‌ల‌కుండా ఉంటే బౌండ‌రీకి వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇది టీమ్ఇండియాకు క‌లిసి వ‌చ్చింది. ఒక‌వేళ బంతి బౌండ‌రీకి వెళ్లి ఉంటే విజ‌య స‌మీక‌ర‌ణం ఒక్క బంతికి 5 ప‌రుగులుగా ఉండేది. ఆఖ‌రి బంతికి సిక్స్ కొడితే ఆస్ట్రేలియా గెలిచేది లేదంటే బౌండ‌రీ వెళ్లి ఉంటే మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్ కు దారి తీసేది. అయితే.. ఆస్ట్రేలియాకు అదృష్టం క‌లిసి రాలేదు. దీనిపై కూడా హెడెన్ మండిప‌డ్డాడు.

IND vs AUS : కొద్దిలో మిస్సైంది.. లేకుంటే అంపైర్ బాక్స్ బ‌ద్ద‌ల‌య్యేదిగా..! వీడియో వైర‌ల్‌

అంపైర్ ఈ ఓవ‌ర్‌లో రెండోసారి త‌న ప‌ని పూర్తి చేశాడు. దీన్ని చూడండి ఇప్పుడు స్క్వేర్ నుంచి కాదు.. ఫ్రంట్ అంపైర్. వారిద్ద‌రూ పోటీ ప‌డుతున్నారు. అంటూ హెడెన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు.