Revanth Reddy : సీఎంగా రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీ నుంచి కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు

సీఎల్పీ నాయకుడిగా,ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.

Revanth Reddy : సీఎంగా రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీ నుంచి కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు

CM Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక..సీఎం అభ్యర్థి ఎవరు…? అనే విషయంపై అధిష్టానం కీలక సమావేశాలు నిర్వహించి ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రేవంత్ కాంగ్రెస్ అధిష్టానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎల్పీ నాయకుడిగా తనను ఎంపిక చేసిందనందుకు..ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

తనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ తల్లి సోనియమ్మ స్పూర్తిదాయకమైన నేత, రాహుల్ గాంధీ, ప్రజాకర్షక నాయకురాలు ప్రియాంక గాంధీలకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచితన కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.

సీఎంగా రేవంత్ ను ప్రకటించాక ఆయనను అధిష్టానం ఢిల్లీకి రమ్మని పిలవటంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. రేవంత్ కు ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ అధికారులు సీఎం హోదాలో రేవంత్ కు ప్రోటోకాల్ స్వాగతం పలికారు. ఆ తరువాత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె శివకుమార్‌తో రేవంత్ భేటీ అయ్యారు.

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. ఇవాళ ఖర్గే, సోనియా, రాహుల్ తో భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ

ఈ భేటీ చాలా సేపు కొనసాగింది. క్యాబినెట్‌ కూర్పుపై వీరి మధ్య చర్చజరిగినట్లు తెలుస్తోంది. క్యాబినెట్‌లో ఎవరెవరు ఉండాలి, సామాజిక సమీకరణాల మేరకు ఎవరికి అవకాశం కల్పించాలి, డిప్యూటీ సీఎంలుగా ఎవరికి చాన్స్‌ ఇవ్వాలన్న దానిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాగూర్‌తోనూ భేటీ అయ్యారు. గతంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఠాగూర్ పనిచేశారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఎంపిక చేయడంలో ఠాగూర్ కీలక పాత్ర పోషించారు.

కాగా ప్రమాణస్వీకారం కార్యక్రమానికి రావాలని రేవంత్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను స్వయంగా ఆహ్వానిస్తారు. రేవంత్ సీఎం కావటంతో ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పండుగ వాతావరణ నెలకొంది. ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ గ్రామానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎం కావడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.