Team India : ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. యువ పేసర్‌కు లక్కీఛాన్స్.. అరంగ్రేటం ప‌క్కా..!

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది

Team India : ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. యువ పేసర్‌కు లక్కీఛాన్స్.. అరంగ్రేటం ప‌క్కా..!

Avesh Khan added to Team India squad

Team India for second test : ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. దీంతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో 0-1తో భార‌త్ వెనుక‌బ‌డింది. ఇక ఈ టెస్టు సిరీస్‌ను టీమ్ఇండియా గెల‌వ‌డం అసాధ్యం. కేప్‌టౌన్ వేదిక‌గా జ‌న‌వ‌రి మూడు నుంచి ఏడు వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు మ్యాచులో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భార‌త్ ప‌ట్టుద‌ల‌గా ఉంది.

ద‌క్షిణాఫ్రికాతో రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌కు మొద‌ట ప్ర‌క‌టించిన జ‌ట్టులో మ‌హ్మ‌ద్ ష‌మీకి స్థానం ద‌క్కింది. అయితే.. గాయంతో బాధ‌ప‌డుతున్న అత‌డు పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. మొద‌టి టెస్టు మ్యాచులో ఓట‌మి నేథ‌ప్యంలో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 27 ఏళ్ల అవేశ్ ఖాన్‌ను రెండో టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేసింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా బీసీసీఐ తెలిపింది.

AUS vs PAK: గెల‌వ‌డ‌మే మ‌రిచిపోయిన పాకిస్తాన్..! 1999 నుంచి వ‌రుస‌గా 16వ టెస్టు మ్యాచులో ఓట‌మి..


కాగా.. ద‌క్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌లో అవేశ్ ఖాన్ రాణించాడు. 6 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. దీంతో అత‌డిని సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. టెస్టు జ‌ట్టుకు ఎంపిక కావ‌డం అవేశ్ ఖాన్‌కు ఇదే మొద‌టి సారి కావ‌డం గ‌మ‌నార్హం. కాగా.. మొద‌టి టెస్టు మ్యాచులో ప్ర‌సిద్ధ్ కృష్ణ ధారాళంగా ప‌రుగులు ఇచ్చిన నేప‌థ్యంలో అత‌డి స్థానంలో అవేశ్ ఖాన్ అరంగ్రేటం చేయ‌నున్నాడు అని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త్‌కు ఐసీసీ షాక్‌.. ద‌క్షిణాఫ్రికా అదృష్టం మామూలుగా లేదుగా..!

రెండో టెస్టు కోసం భార‌త జ‌ట్టు ఇదే.. రోహిత్ శ‌ర్మ్ ( కెప్టెన్ ), శుభ‌మ‌న్ గిల్‌, య‌శ‌స్వి జైస్వాల్‌, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్య‌ర్, కేఎల్ రాహుల్, ర‌వి చంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా, శార్దూల్ ఠాకూర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ముకేశ్ కుమార్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, ప్ర‌సిద్ధ్‌ కృష్ణ‌, కేఎస్ భ‌ర‌త్‌, అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, అవేశ్ ఖాన్