Ajinkya Rahane : టీమ్ఇండియా ఘోర ఓట‌మి త‌రువాతి రోజు ర‌హానే పోస్ట్.. వైర‌ల్‌

టీమ్ఇండియా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన త‌రువాతి రోజు సోష‌ల్ మీడియాలో సీనియ‌ర్ ఆట‌గాడు అజింక్య ర‌హానే ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

Ajinkya Rahane : టీమ్ఇండియా ఘోర ఓట‌మి త‌రువాతి రోజు ర‌హానే పోస్ట్.. వైర‌ల్‌

Ajinkya Rahane

Ajinkya Rahane Post viral : ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై తొలిసారి టెస్టు సిరీస్ గెల‌వాల‌ని భావించిన టీమ్ఇండియాకు నిరాశే ఎదురైంది. సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో భార‌త్ ఇన్నింగ్స్ 32 ప‌రుగుల భారీ తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. ఈ క్ర‌మంలో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో 0-1తో వెనుక‌బ‌డి పోయింది. ఇక ఈ సిరీస్‌ను టీమ్ఇండియా సొంతం చేసుకోవ‌డం అసాధ్యం. అయితే.. రెండో టెస్టు మ్యాచులో గెలిచి సిరీస్‌ను స‌మం చేసే ఛాన్స్ మాత్రం ఉంది.

2023 సంవ‌త్స‌రాన్ని భార‌త జ‌ట్టు ఓట‌మితో ముగించింది. కేఎల్ రాహుల్ సెంచ‌రీ (101) చేయ‌డంతో టీమ్ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 245 ప‌రుగులు చేసింది. అయితే.. ఓపెన‌ర్ డీన్ ఎల్గ‌ర్ భారీ శ‌త‌కం (185) తో రాణించ‌డంతో సౌతాఫ్రికా మొద‌టి ఇన్నింగ్స్‌లో 408 ప‌రుగులు చేసింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భార‌త్ విరాట్ కోహ్లి (76) మిన‌హా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 131 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఇన్నింగ్స్ ఓట‌మి భార‌త్‌కు త‌ప్ప‌లేదు.

Team India : ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. యువ పేసర్‌కు లక్కీఛాన్స్.. అరంగ్రేటం ప‌క్కా..!

ఈ సిరీస్‌కు అనుభ‌వ‌జ్ఞులైన అజింక్యా ర‌హానే, ఛ‌తేశ్వ‌ర్ పుజారాల‌కు స్థానం ద‌క్క‌లేదు. య‌శ‌స్వి జైస్వాల్‌, శుభ్‌మన్ గిల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ వంటి యువ ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా.. టీమ్ఇండియా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన త‌రువాతి రోజు సోష‌ల్ మీడియాలో సీనియ‌ర్ ఆట‌గాడు అజింక్య ర‌హానే ఓ వీడియోను పోస్ట్ చేశాడు. నాలుగు సెక‌న్ల నిడివి గ‌ల ఈ క్లిప్‌లో ర‌హానే డెలివ‌రీ ఫ్లిక్ షాట్ ను చూడొచ్చు. ఈ వీడియోకి విశ్రాంతి అనేది లేదు అని ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) లో క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

అప్ప‌టి వ‌ర‌కు రెగ్యుల‌ర్ ప్లేయ‌ర్ అయిన అజింక్యా ర‌హానేను 2021-22 ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న త‌రువాత తొల‌గించారు. అయితే.. రంజీల‌తో పాటు ఐపీఎల్ 2023లో స‌త్తా చాటిన ర‌హానే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ 2023కి చోటు ద‌క్కించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో మొద‌టి ఇన్నింగ్స్‌లో 89, రెండో ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు. అయితే.. వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో విఫ‌లం అయ్యాడు. దీంతో జ‌ట్టులో మ‌ళ్లీ స్థానం కోల్పోయాడు.

MS Dhoni : ఆహారం కోసం పాకిస్తాన్‌కు వెళ్లండి.. అభిమానికి ధోని స‌ల‌హా..! వీడియో వైర‌ల్‌

కాగా.. టీమ్ఇండియా త‌రుపున ర‌హానే ఇప్ప‌టి వ‌ర‌కు 85 టెస్టు మ్యాచులు ఆడాడు. 38.46 స‌గ‌టుతో 5,077 ప‌రుగులు చేశాడు. 12 సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు బాదాడు. ఆరు టెస్టు మ్యాచుల్లో భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు.