Venky 75 Event : వెంకీ మామ 75 సినిమాల సెలబ్రేషన్స్ ప్రోమో చూశారా? ఫుల్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?
వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ 'సైంధవ్' నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించింది.
Venky 75 Event : టాలీవుడ్ విక్టరీ వెంకటేష్(Venkatesh) తన కెరీర్ లో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్నారు. తన 75వ మూవీగా ‘సైంధవ్’”(Saindhav) సినిమాని ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ సైంధవ్ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి(Chiranjeevi), రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ, నిఖిల్, విశ్వక్ సేన్, అనిల్ రావిపూడి.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటు చిత్రయూనిట్ ఈ ఈవెంట్ కి విచ్చేశారు.
అయితే ఈ వెంకీ 75 ఈవెంట్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ యాప్ ఈ విన్ కొనుక్కోవడంతో ఈవెంట్ ని బయట టెలికాస్ట్ చేయలేదు. కేవలం కొంతమంది ఫ్యాన్స్ మధ్యే ఈవెంట్ నిర్వహించారు. తాజాగా ఈ ఈవెంట్ ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ ఈవెంట్లో కామెడీ స్కిట్స్, డ్యాన్సులు, పాటలు, ఎమోషనల్ స్పీచ్ లు, గేమ్స్.. ఇలా అన్ని కలగలిపి ఉన్నాయి. ప్రస్తుతం వెంకీ 75 ఈవెంట్ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
Also Read : Star Directors : 2023 సినిమా ఇండస్ట్రీని ఊపేసిన టాప్ 5 డైరెక్టర్స్ వీళ్ళే.. భారీ సినిమాలతో..
ఇక ఫుల్ ఈవెంట్ ఈ విన్ ఓటీటీ యాప్ లో నేడు సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో వెంకీ మామ అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ ని న్యూ ఇయర్ కానుకగా ఫ్రీగానే అందిస్తుంది ఈ విన్. ఇంకెందుకు ఆలస్యం న్యూ ఇయర్ కి వెంకీ మామ్ 75 సినిమాల ఈవెంట్ తో ఎంజాయ్ చేసేయండి..