సీఎం రేవంత్ చొరవతో.. మూడేళ్ల తర్వాత రిపబ్లిక్ డే పరేడ్‎లో తెలంగాణ శకటానికి చోటు

కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులతో తెలంగాణ శకటాన్ని రూపకల్పన చేశారు.

సీఎం రేవంత్ చొరవతో.. మూడేళ్ల తర్వాత రిపబ్లిక్ డే పరేడ్‎లో తెలంగాణ శకటానికి చోటు

Telangana Republic Day Tableau

Telanganas Republic Day Tableau : భారత 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో తెలంగాణ శకటం పాల్గొననుంది. దాదాపు మూడేళ్ల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం కనువిందు చేయనుంది. 2015, 2020 తర్వాత మూడోసారి తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులతో తెలంగాణ శకటాన్ని రూపకల్పన చేశారు.

గణతంత్ర దినోత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమవుతోంది. వికసిత్ భారత్, భారత్ లోక్ తంత్ర్ కి మాత్రుక అన్న థీమ్ తో ఈసారి గణతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఈసారి వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శకటం ఎంపిక అయ్యింది. 2015, 2020 తర్వాత మూడోసారి 2024లో రిపబ్లిక్ డే పరేడ్ కు తెలంగాణ శకటం ఎంపికైంది. ఈసారి బ్రిటీష్ పాలకులపై తిరగబడిన వీరులు, అమరుల త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ శకటం రూపకల్పన చేశారు.

Also Read : తెలంగాణ టు అయోధ్య స్పెషల్ ట్రైన్స్ షెడ్యూల్ ఇదే.. నియోజకవర్గాల వారీగా అయోధ్యకు భక్తులు!

ప్రజాస్వామ్యానికి పోరాటాలు ఏ విధమైన స్ఫూర్తినిస్తాయి అన్న థీమ్ తో శకటాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు పరిఢవిల్లించే విధంగా ఈసారి శకటాన్ని రూపకల్పన చేశారు. గణతంత్ర వేడుకల పరేడ్ లో శకటానికి స్థానం దక్కడం గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఈసారి స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను, వారి త్యాగాలను గుర్తు చేసేలా శకటం డిజైన్ చేసింది ప్రభుత్వం.

నాడు మర్రి చెట్టుకు వెయ్యి మందిని ఒకేసారి ఉరివేసిన పరిస్థితి ఉంది. ఆ అంశాన్ని చాటి చెప్పే విధంగా థీమ్ ఉంది. శకటంపై మర్రి చెట్టును సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నాట్య కళను ప్రదర్శించే విధంగా తెలంగాణ నుంచి కళాకారులు ఢిల్లీ చేరుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట నుంచి కళాకారులు ఢిల్లీకి వెళ్లారు. శకటంతో పాటు తెలంగాణ కళారూపాలు అయిన డప్పులు, బంజారా నృత్యాలు చేస్తే తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని చాటనున్నారు.

Also Read : రూ.3,200 కోట్లు వృథా.. మేడిగడ్డ వెనుక భారీ స్కాం.. విచారణలో మరిన్ని సంచలన విషయాలు