భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్.. ఉదయం 6.30 నుంచే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతి

టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్.. ఉదయం 6.30 నుంచే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతి

IND vs ENG Rachakonda police gear up for first test match in Hyderabad

IND vs ENG 1st Test: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యంత ఆధునికంగా ఉప్పల్ స్టేడియాన్ని రెడీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 5 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. జనవరి సైనిక అధికారులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశాన్ని కల్పిస్తారు.

పటిష్ట బందోబస్తు: రాచకొండ సీపీ
భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఉదయం 6.30 నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అమతిస్తామని వెల్లడించారు. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఉన్నాయి. మా పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతాం. పీక్ హవర్స్ లో ప్రేక్షకులు వస్తారు కాబట్టి.. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఆక్టోపస్ బలగాలతో పాటు 1500 మంది పోలీసులతో మ్యాచ్ కి బందోబస్తు. 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయి.

Also Read: హైదరాబాద్‌లో అట్టహాసంగా బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్.. అవార్డులు అందుకున్న క్రికెటర్లు వీరే

కెమెరాలు, లాప్‌టాప్స్‌‌, బ్యాగ్స్, సిగెరెట్స్, హెల్మెట్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, పవర్ బ్యాంక్స్, బయటి ఫుడ్ అనుమతించము. డీసెంట్ క్రౌడ్ బిహేవియర్ ఉండాలి. వెండర్స్ ని కూడా వెరిఫై చేసిన తర్వాతే పాసులు జారీ చేశాం. ఒకసారి లోపలికి వెళ్లి బయటకి వస్తే.. తిరిగి మళ్ళీ స్టేడియం లోపలికి అనుమతించం. మ్యాచ్ కి వచ్చేవారికి సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. బ్లాక్ లో టికెట్స్ అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ప్రేక్షకులు తమ సూచనలు పాటించి, సహకరించాలని ఆయన కోరారు.

Also Read: రవిశాస్త్రికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.. భావోద్వేగానికి లోనైన టీమిండియా మాజీ కోచ్‌