రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిని మార్చేసిన ఇంటెలిజెన్స్‌ విభాగం.. ఎందుకంటే?

రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం లీక్ అవుతుందని ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఎస్ డబ్ల్యూ అధికారులను మార్చేసింది.

రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిని మార్చేసిన ఇంటెలిజెన్స్‌ విభాగం.. ఎందుకంటే?

CM Revanth Reddy

CM Revanth Security Changed: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా ఆయన భద్రతకు సంబంధించిన విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం పలు మార్పులు చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేతృత్వంలో రేవంత్ భద్రతపై సమీక్షించిన తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పనిచేసిన ఇంటెలిజెన్స్ వింగ్ కు సంబంధించిన అధికారులు ఇప్పటికీ రేవంత్ రెడ్డి వద్ద కొనసాగుతున్నారు. వీరందరిని తొలగించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలుసైతం జారీ అయ్యాయి.

Also Read : విపక్షాల ఇండియా కూటమికి షాకిచ్చిన దీదీ.. రాహుల్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు

సీఎం దగ్గర పనిచేసే అధికారుల నుంచి ఎలాంటి సమాచారంకూడా బయటకు పొక్కకుండా ఉండాలి. సీఎం రక్షణ బాధ్యతలుకూడా అత్యంత కీలకమైన అంశం కావటంతో ఇంటలిజెన్స్ విభాగం అప్రమత్తమైంది. రేవంత్ కోటరీ నుంచి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఐఎస్ డబ్ల్యూ అధికారులను మార్పులు చేసింది. వీరిలో కొందరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద తొమ్మిదేళ్లుగా పనిచేసిన వారు ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సీఎం రేవంత్ వద్ద వారిని ఇంకా కొనసాగించడం సరికాదని భావించిన ఇంటెలిజెన్స్ విభాగం వారిని  సీఎం భద్రత విభాగం నుంచి తొలగించాలని నిర్ణయించింది.