Viral Video: స్కూటర్‌పై భారీ మొసలిని తీసుకెళ్లిన వ్యక్తులు
మొసలిని సిబ్బంది స్కూటరుపై తీసుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్‌లోని వడోదర సహా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అక్కడి విశ్వమిత్రి నదీ ఉద్ధృతి పెరగడంతో అందులోని మొసళ్లు వరద నీళ్లలో ఇళ్లలోకి వస్తున్నాయి. మొసళ్లను అటవీ అధికారులు రక్షించి తీసుకెళ్తున్నారు. వడోదరలో సిబ్బంది సుమారు 40 మొసళ్లను రక్షించి తీసుకెళ్లారు.
ఓ మొసలిని సిబ్బంది స్కూటరుపై తీసుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రాంతంలో మొసలిని కాపాడిన సిబ్బంది స్కూటర్‌పై దాన్ని ఇతర ప్రాంతానికి తరలించారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు స్కూటర్‌ని నడపగా, మరో వ్యక్తి వెనకాల కూర్చుని మొసలిని పట్టుకున్నాడు.
ఆ మొసలిని అటవీ శాఖకు అప్పగించేందుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో మరో వ్యక్తి వీడియో తీశాడు. కాగా, వడోదర విశ్వమిత్రి నదీ తీరంలో ఉంటుంది. అందులో నుంచి వచ్చిన మొసళ్లను సిబ్బంది రక్షించి తీసుకెళ్లి మళ్లీ నదుల్లో వదులుతున్నారు.
Two young men took a crocodile found in Vishwamitra river in Vadodara to the forest department office on a scooter pic.twitter.com/YczoDzUHzP
— Dailynews Viral (@dailynewsceo) September 1, 2024
Also Read: విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్