విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్

విజయవాడ మున్సిపల్ కమిషన్ సొంత ట్రాక్టర్లతో పాటు 250 ట్రాక్టర్లతో సామాన్లు తరలించాలని..

విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్

Updated On : September 1, 2024 / 4:24 PM IST

Hyderabad Vijayawada Highway: భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. విజయవాడ-హైదరాబాద్ మార్గంలోనూ వరద పోటెత్తుతోంది. నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

నందిగామ పోలీసులు ముందస్తుగా వాహనాలను నిలిపివేశారు. కాగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా మళ్లించారు.

మరోవైపు, ఏపీలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు పక్క జిల్లాల నుంచి ఆగమేఘాల మీద బోట్లను రప్పిస్తోంది. ఈలోగా ముంపులో చిక్కుకున్న వారిని తరలించేందుకు ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు.

విజయవాడ మున్సిపల్ కమిషన్ సొంత ట్రాక్టర్లతో పాటు 250 ట్రాక్టర్లతో సామాన్లు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. నగరంలో ఉన్న ట్రాక్టర్ల యజమానులతో మాట్లాడి అన్ని ట్రాక్టర్లను బుడమేరు వరద ముంపు ప్రాంతాల కు తరలించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

ALso Read: భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది: వివరాలు తెలిపిన చంద్రబాబు