Osmania PG Girls Hostel : అర్థరాత్రి కలకలం.. ఉస్మానియా పీజీ ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు

క్యాంపస్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థినుల వద్దకు వచ్చిన పోలీసులు.. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించాలని కోరారు.

Osmania PG Girls Hostel : అర్థరాత్రి కలకలం.. ఉస్మానియా పీజీ ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు

begumpet pg womens hostel

Hyderabad : సికింద్రాబాద్ లోని ఉస్మానియా పీజీ ఉమెన్స్ హాస్టల్ లో అర్థరాత్రి కలకలం రేగింది. హాస్టల్ బాత్రూంలోకి ముగ్గురు ఆగంతకులు చొరబడ్డారు. విద్యార్థినులకు కిటికీ నుంచి సైగలు చేశారు. దుండగులను విద్యార్థినులు పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారు పరారయ్యారు. అందులో ఒక నిందితుడిని కళాశాల హాస్టల్ భద్రత సిబ్బంది సహాయంతో పట్టుకొని చితకబాదారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితులు అర్థరాత్రి వేళ గోడదూకి లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనతో హాస్టల్ లోని విద్యార్థినీలు ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ వద్ద సరియైన భద్రత లేకపోవటం వల్లనే ఇలా జరిగిందంటూ పీజీ కాలేజీ హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు.

Also Read : Tanmay Agarwal : హైదరాబాద్ బ్యాటర్ ఊచకోత.. 39 ఏళ్ల రవిశాస్త్రి రికార్డ్ బ్రేక్.. ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన యువ క్రికెటర్

క్యాంపస్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థినుల వద్దకు వచ్చిన పోలీసులు.. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించాలని కోరారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థినులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పీజీ లేడీస్ హాస్టల్ వద్ద విద్యార్థినుల రక్షణకోసం ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. విద్యార్థినుల రక్షణ విషయంలో కళాశాల ప్రిన్సిపల్ వీసీతో సాయంత్రం మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని, నిందితులు ఎలా లోపలికి ప్రవేశించారనే విషయంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని నార్త్ జోన్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని చెప్పారు. ఘటనపై దర్యాప్తు నిర్వహించిన అనంతరం నిందితుడు వివరాలు వెల్లడిస్తామని రోహిణి ప్రియదర్శిని తెలిపారు. మరోసారి హాస్టల్ వద్ద ఇలాంటి ఘనటలు పునరావృతం కాకుండా భద్రత చర్యలు చేపట్టేలా కళాశాల ప్రిన్సిపల్, వీసీతో మాట్లాడతామని పోలీసుల హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.