Ravi Teja : అందరూ టికెట్ రేట్లు పెంచుతుంటే.. రవితేజ ‘ఈగల్’ మాత్రం పెంచకుండానే

స్టార్ హీరోల సినిమాలకి థియేటర్లలో టికెట్ ధరల మోత మోగుతుంటే.. రవితేజ ఈగల్ సినిమాకి టికెట్ రేటు పెంచకుండానే విడుదల చేస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Ravi Teja : అందరూ టికెట్ రేట్లు పెంచుతుంటే.. రవితేజ ‘ఈగల్’ మాత్రం పెంచకుండానే

Ravi Teja

Ravi Teja : మాస్ మహారాజ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది. ఈగల్‌లో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్.. ఇలా పలువురు స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Varun Tej : భార్య గురించి స్టూడెంట్స్ మధ్యలో వరుణ్ ఏం చెప్పాడో తెలుసా?

ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ చూసి ఈగల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రవితేజ లుక్ అయితే చాలా కొత్తగా ఉంది. దీంతో మాస్ మహారాజ అభిమానులు ఈగల్ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు వస్తుంటే థియేటర్ టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. 300 – 400 రూపాయల వరకు కూడా టికెట్ రేట్లు పెంచుతున్నారు. దీంతో కొంతమంది ఆ రేట్లు చూసి సినిమాకి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నారు.

కానీ ఈగల్ సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోవడం గమనార్హం. ఈగల్ సినిమాకి సింగిల్ స్క్రీన్స్‌లో నేల టికెట్ రూ. 50 రూపాయల నుంచి బాల్కనీ  రూ.110 రూపాయల వరకే ఉంది. కొన్ని స్క్రీన్స్‌లో రూ.150 రూపాయలు ఉంది. ఇక మల్టీప్లెక్స్ లలో కూడా టికెట్ రేట్లు పెంచకపోవడం గమనార్హం. చాలావరకు మల్టీప్లెక్స్‌లలో రూ. 150, రూ. 200 రూపాయలే ఉండటం విశేషం. ఇటీవల చిన్న సినిమాలు కూడా ఇదే రేట్స్‌లో వస్తుంటే స్టార్ హీరో రవితేజ సినిమా, పెద్ద సినిమాకి కూడా టికెట్ రేటు పెంచకుండా ఇదే రేటుతో వస్తుండటంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Ambajipeta Marriage Band : ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ టీమ్ ఆ ఊరి కోసం ఏం చేస్తోందంటే?

ఇక ఇప్పటికే ఈగల్ సినిమాని రవితేజ చూసి ఫుల్ సాటిస్‌ఫైడ్ అంటూ, సినిమా అదిరిపోయింది అంటూ రివ్యూ ఇచ్చేసారు. దీంతో మాస్ మహారాజ అభిమానులు రవన్నని కొత్త లుక్‌లో స్టైలిష్ మాస్ సినిమాలో చూడటానికి ఎదురుచూస్తున్నారు.