ICC Under 19 World Cup 2024 : అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లిన టీమ్ఇండియా.. సెమీస్‌లో ద‌క్షిణాఫ్రికా పై విజ‌యం

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌2024లో టీమ్ఇండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

ICC Under 19 World Cup 2024 : అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లిన టీమ్ఇండియా.. సెమీస్‌లో ద‌క్షిణాఫ్రికా పై విజ‌యం

ICC Under 19 World Cup 2024 India beat South Africa by 2 wickets and enter into final

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌2024లో టీమ్ఇండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. మంగ‌ళ‌వారం సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచులో రెండు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ద‌క్షిణాఫ్రికా నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 48.5 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో సచిన్ దాస్ (96; 95 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్‌) తృటిలో సెంచ‌రీని చేజార్చుకున్నాడు. కెప్టెన్ ఉదయ్ సహారన్ (81; 124 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కం బాదాడు. ఆఖ‌ర్లో రాజ్ లింబాని (13నాటౌట్; 4 బంతుల్లో 1ఫోర్‌, 1సిక్స్‌) రాణించాడు. స‌ఫారీ బౌల‌ర్ల‌లో క్వేనా మఫాకా, ట్రిస్టన్ లూస్ లు చెరో మూడు వికెట్లు తీశారు.

245 ప‌రుగ‌ల ల‌క్ష్య ఛేద‌న‌లో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. ఓపెన‌ర్లు ఆదర్శ్ సింగ్ (0), అర్షిన్ కులకర్ణి(12)ల‌తో పాటు ముషీర్ ఖాన్ (4), ప్రియాంషు మోలియా(5) లు త‌క్కువ స్కోరుకే పెవిలియ‌న్‌కు చేర‌డంతో భార‌త్ 32 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్య‌త‌ల‌ను సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహారన్ భుజాన వేసుకున్నారు. స‌చిన్ దాస్ ఎడా పెడా బౌండ‌రీలు బాదుతూ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల పై ఎదురుదాడికి దిగాడు.

Mumbai Indians : రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డానికి గ‌ల కార‌ణాన్ని చెప్పిన ముంబై కోచ్‌.. స్పందించిన హిట్‌మ్యాన్ భార్య‌

మ‌రో వైపు కెప్టెన్ ఉద‌య్ క్రీజులో పాతుకుపోయాడు. వీరిద్ద‌రు అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు బౌండ‌రీలు కొడుతూ సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును న‌డిపించారు. సెంచ‌రీకి నాలుగు ప‌రుగుల దూరంలో స‌చిన్‌ను క్వేనా మఫాకా ఔట్ చేశాడు. స‌చిన్‌-ఉద‌య్ జోడి ఐదో వికెట్‌కు ఐదో వికెట్‌కు 173 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఈ ద‌శ‌లో స‌ఫారీ బౌల‌ర్లు విజృంభించ‌డంతో భార‌త్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. 49వ ఓవ‌ర్‌లో ఉద‌య్ ర‌నౌట్ కావ‌డంతో ఆందోళ‌న నెల‌కొన్న‌ప్ప‌టికీ రాజ్ లింబాని ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు.

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాప్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. సఫారీ బ్యాట‌ర్ల‌లో లువాన్‌ డ్రి ప్రిటోరియస్ (76; 102 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రిచర్డ్‌ సెలెట్స్వేన్‌ (64; 100 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ‌శ‌త‌కాలు చేశారు. భారత బౌలర్లలో లింబాని మూడు వికెట్లు తీశాడు. ముషీర్‌ ఖాన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సౌమి పాండే, నమన్ తివారీ లు చెరో వికెట్ సాధించారు.

India tour Of Zimbabwe : అలా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అయిపోగానే.. ఇలా జింబాబ్వేకు వెళ్ల‌నున్న భార‌త క్రికెట‌ర్లు