Sreeleela : బ్రెయిన్ లేని అబ్బాయే కావాలంటున్న శ్రీలీల.. క్యూట్‌గా శ్రీలీల ఇంటర్వ్యూ.. ప్రోమో చూశారా?

తాజాగా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ 'ఒరిజినల్' అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాంని మొదలుపెట్టింది. ఈ ఇంటర్వ్యూలను సౌమ్య హోస్ట్ చేస్తుండగా పలువురు సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఒరిజినల్ ఇంటర్వ్యూకి మొదటి ఎపిసోడ్ కి శ్రీలీల వచ్చింది.

Sreeleela : బ్రెయిన్ లేని అబ్బాయే కావాలంటున్న శ్రీలీల.. క్యూట్‌గా శ్రీలీల ఇంటర్వ్యూ.. ప్రోమో చూశారా?

Sreeleela Cute Original Interview with Soumya Promo Released

Sreeleela : వచ్చిన తక్కువ టైంలోనే తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది శ్రీలీల. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టింది. ఇక తన నటన, అందం, డ్యాన్స్ తో ప్రేక్షకులని మెప్పించి తన అభిమానులుగా మార్చుకుంటుంది. మరోవైపు డాక్టర్ చదువులతో బిజీగా ఉంది.

తాజాగా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ‘ఒరిజినల్’ అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాంని మొదలుపెట్టింది. ఈ ఇంటర్వ్యూలను సౌమ్య హోస్ట్ చేస్తుండగా పలువురు సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఒరిజినల్ ఇంటర్వ్యూకి మొదటి ఎపిసోడ్ కి శ్రీలీల వచ్చింది. ఇంటర్వ్యూలో క్యూట్, ఫన్నీ ప్రశ్నలు అడిగారు. ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రోమో అంతా ఫుల్ ఫన్నీగా సాగింది.

Also Read : Spirit : ప్రభాస్ సరసన రష్మిక మందన్న? ‘స్పిరిట్’లో గట్టిగానే ప్లాన్ చేస్తున్న సందీప్ వంగ..

ఇందులో సౌమ్య.. మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా, ఫన్నీ, జోవియల్ గా ఉండే అబ్బాయి కావాలా అని అడిగితే శ్రీలీల.. ఫన్నీ, జోవియల్ అబ్బాయే కావాలి, బ్రెయిన్ తో చేసే పనులు నేను చూసుకుంటాను అని చెప్పింది. ఇండైరెక్ట్ గా బ్రెయిన్ లేని అబ్బాయి అయిన పర్లేదు, నవ్వించే అబ్బాయి కావాలంటుంది. ఇలాంటి బోలెడన్ని సరదా ప్రశ్నలు ఈ ఇంటర్వ్యూలో అడిగినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేయనున్నారు.