Special Recipes : రెడిమేడ్ పిండి వంటలకు భలే గిరాకీ.. విదేశాలకు ఎగుమతి

Special Recipes : ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం, చిన్నమేర గ్రామానికి చెందిన కొంత మంది మహిళలు కొన్నేళ్లుగా అధికంగా కట్టెలపొయ్యుమీదే పిండివంటల తయారీ చేస్తూ.. లాభాలు గడిస్తున్నారు.

Special Recipes : రెడిమేడ్ పిండి వంటలకు భలే గిరాకీ.. విదేశాలకు ఎగుమతి

Special Recipes

Special Recipes : సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది రెడిమేడ్ పిండి వంటలపై ఆధారపడుతున్నారు. పదేళ్ల కింద వరకు అంతా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. గత కొన్నేళ్లుగా బయట ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సంక్రాంతి పురస్కరించుకుని తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొందు మహిళలు పిండివంటలు తయారు చేస్తూ.. వినియోగదారులకు అందిస్తూ.. మంచి ఆదాయం గడిస్తున్నారు.

Read Also : Corn Cultivation Tips : మొక్కజొన్న నిల్వల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సంక్రాంతి పండగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవటం సంప్రదాయంగా వస్తోంది. అయితే మారుతున్న జీవనశైలి, ఇంట్లో వాళ్లు ఉద్యోగాల్లో తీరికలేకపోవడం వల్ల చాలామంది మార్కెట్‌లో లభించే పిండి పదార్థాలపై ఆధారపడుతున్నారు. కొన్నేళ్లుగా దుకాణాల్లో ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సంక్రాంతి వేళ పిండివంటల తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి.

అధికంగా కట్టెలపోయ్యిమీదే పిండివంటల తయారీ :
సకినాలు, అరిసెలు, చెగొడీలు, మురుకులు, గవ్వలు, లడ్డూలు, గరిజలు ఇలాంటి పిండి వంటలకు గిరాకీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే గ్రామాల్లో కొంత మంది మహిళలు కలిసి పిండి వంటలు తయారు చేస్తూ.. స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం, చిన్నమేర గ్రామానికి చెందిన కొంత మంది మహిళలు కొన్నేళ్లుగా అధికంగా కట్టెలపొయ్యుమీదే పిండివంటల తయారీ చేస్తూ.. లాభాలు గడిస్తున్నారు.

తీరికలేని జీవితాల కారణంగా ఇళ్లలో తయారీ చేసుకోవడం బాగా తగ్గిపోయింది. సంక్రాంతికే ప్రత్యేకమైన సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు వంటి రకరకాల పిండివంటలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాలు, విదేశాల్లో ఉంటున్న తమ బంధుమిత్రులకు సైతం పిండివంటలు పంపిస్తుండడం విశేషం. విలువైన సమయం వృథా కాకుండా, ప్రయాస పడకుండానే పిండివంటలు కొనుక్కుని ఇంటిల్లిపాది పండగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రజలు .

రెడీమేడ్ పిండి వంటల తయారీ కేంద్రాలు మహిళలకు ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లోఎక్కువ మహిళలు ఉద్యోగాలు చేస్తుండటం, అందరికీ అన్ని పిండి వంటలు రాకపోవడం వల్లే తయారీ కేంద్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమగా మారిపోయాయి.

Read Also : Mirchi Cultivation : మిరపను ఆశించే పూత పురుగు నివారణ