Farming Sesame Seeds : అధిక దిగుబడుల కోసం నువ్వులో యాజమాన్యం

Farming Sesame Seeds : వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు, ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు.

Farming Sesame Seeds : అధిక దిగుబడుల కోసం నువ్వులో యాజమాన్యం

Farming Sesame Seeds

Farming Sesame Seeds : రబీ సీజన్‌లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. ఖరీఫ్‌ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతోంది.

అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు, ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు.

అధిక దిగుబడులకు పాటించాల్సిన సూచనలు : 
నువ్వు, అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. వేసవి కాలంలో రెండు మూడు నీటితడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. భారత దేశంలో గత ఏడాది 19 లక్షల హెక్టార్లలో నువ్వుసాగుకాగా, ఆంద్రప్రదేశ్ లో 67 వేల హెక్టార్లలో సాగైంది.

Read Also : Chrysanthemum Cultivation : సిరులు కురిపిస్తున్న చామంతి పూల సాగు

అయితే సరాసరి ఎకరాకు 375 కిలోలు దిగుబడి పొందుతున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ వుండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మనదేశం 2వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది.  జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుకోవచ్చు.

కోస్తా రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు మొదటి పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా వుంటుంది.  నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్థుతం మార్కెట్లో క్వింటా  నువ్వులకు  రూ. 10 వేల పైనే ధర పలుకుతున్నాయి.

ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం వుండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే రకాల ఎంపిక యాజమాన్యం కీలకమని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా ఎలమంచిలి  వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు.

నువ్వు పంట విత్తడం ఒక ఎత్తైతై ఎరువుల యాజమాన్యం అంతే ముఖ్యం. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమయానుకూలంగా అందించాలి. అంతేకాదు ఈ పంటలో కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యం చాలా కీలకమని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త తులసి లక్ష్మి.

Read Also : Mirchi Cultivation : మిరపను ఆశించే పూత పురుగు నివారణ