విశాఖలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు.. రూ.3కోట్లు ఫేక్ కరెన్సీ స్వాధీనం

బ్లాక్ కలర్ లో ఉన్న ఈ ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారతాయి.

విశాఖలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు.. రూ.3కోట్లు ఫేక్ కరెన్సీ స్వాధీనం

Visakha Fake Currency

Visakha Fake Currency : విశాఖలో డెకాయ్ ఆపరేషన్ ద్వారా నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. భాస్కర రాజు, మద్దాల శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులను ఫేక్ కరెన్సీ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ”భాస్కర రాజుకు అన్నవరంకి చెందిన గన్ని రాజు అనే వ్యక్తితో కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. ఫేక్ కరెన్సీ వ్యవహారం చెప్పి మొదట కొంత మొత్తం మార్చి నమ్మించాడు. పూర్తి నమ్మకం కలిగిన తర్వాత 3 కోట్ల విలువ చేసే నోట్లను 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు.

ఫేక్ కరెన్సీ మార్చే సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు కాకాని నగర్ వద్ద పట్టుబడ్డారు. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారతాయి. ఫేక్ కరెన్సీ నోట్ల కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. మూడో ముద్దాయి గని రాజు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాము. వీరిద్దరి నుండి 3 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, కారు, వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాం” అని పోలీసులు తెలిపారు.

Also Read : కొరియర్ పేరుతో ఘరానా మోసం.. 2కోట్లు పోగొట్టుకున్న ఐటీ కంపెనీ సీఈవో