Sachin Tendulkar : రిటైర్మెంట్ అయి ప‌దేళ్లు.. అయినా గానీ.. స‌చిన్‌కు క్రేజీ అనుభ‌వం..

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Sachin Tendulkar : రిటైర్మెంట్ అయి ప‌దేళ్లు.. అయినా గానీ.. స‌చిన్‌కు క్రేజీ అనుభ‌వం..

Sachin Chants Buzzing In Entire Flight As Tendulkar Travels Economy

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌న‌దేశంలోనే కాకుండా ప్ర‌పంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎంద‌రో క్రికెట‌ర్లు స‌చిన్‌ను స్పూర్తిగా తీసుకుని రాణిస్తున్నారు అంటే అతిశ‌యోక్తి కాదేమో. దాదాపు పాతికేళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డుల‌ను టెండూల్క‌ర్ బ‌ద్ద‌లు కొట్టాడు. అభిమానులు అంద‌రూ అత‌డిని ముద్దుగా క్రికెట్ దేవుడు అని పిలుచుకుంటూ ఉంటారు.

స‌చిన్ 2013 న‌వంబ‌ర్‌లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. రిటైర్‌మెంట్ అయి 10 ఏళ్లు దాటినా కూడా స‌చిన్ కు ఉన్న క్రేజ్ త‌గ్గ‌లేదు. అత‌డు ఎక్క‌డ క‌నిపించినా కూడా స‌చిన్.. స‌చిన్ అంటూ కేరింత‌లు కొడుతూనే ఉంటారు. తాజాగా మాస్ట‌ర్ కశ్మీర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాడు. త‌న కుటుంబంతో క‌లిసి ఈ దిగ్గ‌జ ఆట‌గాడు ప్ర‌యాణిస్తుండ‌గా.. విమానంలోని మిగిలిన‌ ప్ర‌యాణీకులు అంతా కూడా స‌చిన్ నామ‌స్మ‌ర‌ణ‌తో హోరెత్తించారు.

Babar Azam : చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజాం.. టీ20క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో స‌చిన్ వారికి ధ‌న్య‌వాదాలు చెబుతూ త‌న సీటులో కూర్చోవ‌డాన్ని చూడొచ్చు.

భూత‌ల స్వ‌ర్గానికి ద‌గ్గ‌ర‌గా..

త‌న కుటుంబంతో క‌లిసి స‌చిన్ తొలిసారి క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాడు. అక్క‌డి అందాల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు తెలిపాడు. భూత‌ల స్వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

టీమ్ఇండియా త‌రుపున స‌చిన్ 200 టెస్టులు, 463 వ‌న్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. 200 టెస్టుల్లో 15,921 ప‌రుగులు చేశాడు. ఇందులో 51 శ‌త‌కాలు 68 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 463 వ‌న్డేల్లో 18426 ప‌రుగులు చేశాడు. ఇందులో 49 సెంచ‌రీలు, 96 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఒకే ఒక టీ20 మ్యాచులో 10 ప‌రుగులు చేశాడు. 78 ఐపీఎల్ మ్యాచుల్లో 2334 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, 34 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

కోహ్లికి కొడుకు పుట్టాడ‌ని తెలిసి.. పాకిస్తాన్‌లో ఏం చేశారో తెలుసా?