ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024.. ఈ విషయాలు మీకు తెలుసా?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమవుతుంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024.. ఈ విషయాలు మీకు తెలుసా?

WPL 2024 second season all you need to know

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమవుతుంది. టోర్ని ఆరంభ మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్.. గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు కూడా ఈ టోర్నిలో ఆడుతున్నాయి. మొత్తం 22 మ్యాచ్ లు జరుగుతాయి. మార్చి 17న ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అయితే ఈ టోర్నమెంట్ సంబంధించి క్రికెట్ అభిమానుల మెదళ్లలో మెదులుతున్న పలు ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ చూద్దాం.

WPL 2024కి బెంగళూరు మాత్రమే వేదికగా ఉందా?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కు బెంగళూరుతో పాటు ఢిల్లీ వేదికగా ఉంది. మొదటి సగం మ్యాచ్ లు.. అంటే మార్చి 4 వరకు బెంగళూరులో జరుగుతాయి. ఎలిమినేటర్, ఫైనల్ తో కలిపి సెకండాఫ్ మ్యాచ్ లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. నాకౌట్‌లతో సహా మొత్తం 22 మ్యాచ్ లు జరుగుతాయి.

ఈ ఏడాది టోర్నమెంట్ లో ఏమైనా మార్పులు జరిగాయా?
జట్ల సంఖ్యలో, ఫార్మాట్‌లో ఎటువంటి మార్పులు లేవు. డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఒక్కో జట్టు మిగతా నాలుగు జట్లతో రెండుసార్లు తలపడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి వెళుతుంది. సెకండ్, థర్డ్ వచ్చిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడతాయి. అయితే ఈసారి డబుల్ హెడ్డర్‌లు లేవు.

మ్యాచ్ సమయాలు ఏమిటి?
అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30కి ప్రారంభమవుతాయి. మ్యాచ్‌ల మధ్య ఎటువంటి విరామం లేదు. రెండు నాకౌట్‌ మ్యాచ్‌లకు ముందు మాత్రమే విరామం ఉంది.

WBBLలో లాగా బ్యాట్ ఫ్లిప్ ఉందా?
ఐపీఎల్‌లో మాదిరిగానే కాయిన్ టాస్ ఉంటుంది. బ్యాట్ ఫ్లిప్ ఉండదు.
హర్మన్‌ప్రీత్ కౌర్ గత సీజన్‌లో వరుసగా ఏడుసార్లు టాస్ ఓడిపోయి, ఒకసారి మాత్రమే గెలిచింది. ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్‌ ఆడిన పది మ్యాచ్‌ల్లో తొమ్మిది సార్లు టాస్‌ ఓడింది.

Also Read: ప్ర‌మాదంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ల సెంట్ర‌ల్ కాంట్రాక్టులు

IPL లాగా, WPLలో కూడా ఇంపాక్ట్ సబ్ ఉందా?
లేదు. టాస్ సందర్భంగా ఇచ్చే లిస్టులో పేర్కొన్న 11 మంది ప్లేయర్లు మాత్రమే ఆడతారు. అవసరబట్టి సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్లను అంపైర్లు అనుమతిస్తారు.

WPLలో DRS ఉందా?
ఉంది. అన్ని గేమ్‌లు DRSతో పూర్తిగా టెలివిజన్ చేయబడతాయి. ప్రతి జట్టుకు ఒక్కో ఇన్నింగ్స్‌కు 2 సమీక్షలు ఉంటాయి.

Also Read: ఏం చెప్పావురా..? దెబ్బ‌కు ప్యూజులు ఔట్ అయ్యాయి! షాహీన్ స‌మాధానానికి షాకైన అమీర్‌

వైడ్‌లు, నో-బాల్స్ కూడా DRS ఉంటుందా?
ఉంటుంది. ఆటగాళ్లు వైడ్‌లు, నో-బాల్స్ కోసం DRS రివ్యూ అగడొచ్చు.

కెప్టెన్లు ఎవరైనా మారారా?
మారలేదు. గతేడాది ఐదు టీమ్‌ల‌కు కెప్టెన్లుగా వ్యవహరించిన వారే ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నారు.

Also Read: డ‌బ్ల్యూపీఎల్ 2024 షెడ్యూల్ విడుద‌ల‌.. పూర్తి లిస్ట్ ఇదే.. ఫైన‌ల్ మ్యాచ్ ఎప్పుడంటే..?