Addanki Dayakar: అందుకే బీజేపీ ఇలా చేస్తోంది: అద్దంకి దయాకర్

బిజీగా ఉన్నానని చెబితే కవితకు మినహాయింపు ఇస్తున్నారని చెప్పారు. మరి..

Addanki Dayakar: అందుకే బీజేపీ ఇలా చేస్తోంది: అద్దంకి దయాకర్

Addanki Dayakar

ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలను టార్గెట్‌గా చేస్తూ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ నష్టపోయిందని చెప్పారు.

లిక్కర్ స్కాంలో కవిత పేరును మళ్లీ తెరపైకి తీసుకొచ్చి బీఆర్ఎస్‌ను బెదిరిస్తున్నారని అద్దంకి దయాకర్ అన్నారు. బిజీగా ఉన్నానని చెబితే కవితకు మినహాయింపు ఇస్తున్నారని చెప్పారు. మరి హేమంత్ సొరేన్, సోనియా గాంధీలాంటి వారికి మినహాయింపులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

మాజీ సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని బీజేపీ తమ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిందని తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్రలు పన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు లేడని అన్నారు.

విపక్షాలను భయపెడుతూ ఎదగాలనే కుట్రలకు బీజేపీ పాల్పడుతోందని అద్దంకి దయాకర్ చెప్పారు. తెలంగాణలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అవినీతిని కాపాడింది బీజేపీనేనని ఆరోపించారు.

 Also Read: రమణ దీక్షితులపై వేటు.. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే ..