Chandrababu Delhi Tour : మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు, పవన్..! బీజేపీతో పొత్తులపై రానున్న స్పష్టత..!

పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దాని పై త్వరగా స్పష్టత ఇస్తే అది పార్టీకి అనుకూలంగా ఉంటుందని, గెలుపు అవకాశాలకు ఉపయోగకరంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది.

Chandrababu Delhi Tour : మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు, పవన్..! బీజేపీతో పొత్తులపై రానున్న స్పష్టత..!

Tdp Janasena Bjp Alliance Talks

Chandrababu Delhi Tour : మార్చి మొదటి వారంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మరో 4 రోజుల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పష్టత రానుంది. రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. దానికి కొనసాగింపుగా పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో పొత్తులపై నిర్ణయం సహా ఏపీలో పోటీ చేసే స్థానాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ఏపీలో 6 నుంచి 8 ఎంపీ స్థానాలను ఆశిస్తోంది బీజేపీ. అరకు, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, హిందూపురం లోక్ సభ స్థానాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముందే పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఏపీ రాజకీయాలకు సంబంధించి మార్చి మొదటి వారంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పష్టత రాబోతోంది. బీజేపీ అధిష్టాన వర్గాల సమాచారం ప్రకారం.. మరో 4 రోజుల్లో అంటే మార్చి 4వ తేదీ లోపు పొత్తులపై స్పష్టత రానుంది.

ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును బీజేపీ అగ్రనాయకత్వం ప్రారంభించింది. రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, దానికి కొనసాగింపుగా పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరగబోతోంది. మొదటి విడత జాబితాలోనే దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండేలా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరితే ఏపీకి సంబంధించి 6 నుంచి 8 స్థానాలను బీజేపీ ఆశిస్తోంది.

ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీ వెళ్లినప్పుడు, రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రంలో కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సమయంలోనూ.. రాష్ట్రానికి సంబంధించి అభ్యర్థులు, ఆశావహుల జాబితాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పొత్తులో వెళ్లాలా? సొంతంగా వెళ్లాలా? అన్న దాని పై త్వరగానే స్పష్టత ఇస్తే అది పార్టీకి అనుకూలంగా ఉంటుందని, గెలుపు అవకాశాలకు ఉపయోగకరంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈలోపే పొత్తులకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.

Also Read : గోదావరి జిల్లాల్లో పొత్తు చిచ్చు..! సీట్ల సర్దుబాటుపై జనసైనికులకు ఉన్న అభ్యంతరాలేంటి?