IND vs ENG 5th Test : ఐదో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. బుమ్రా ఇన్‌.. రాహుల్ ఔట్‌.. ఇంకా

ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీమ్ఇండియా సొంతం చేసుకుంది.

IND vs ENG 5th Test : ఐదో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. బుమ్రా ఇన్‌.. రాహుల్ ఔట్‌.. ఇంకా

KL Rahul ruled out Jasprit Bumrah returns for 5th Test

IND vs ENG : ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీమ్ఇండియా సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో ధ‌ర్మ‌శాల వేదిక‌గా మార్చి 7 నుంచి జ‌ర‌గ‌నున్న ఆఖ‌రి టెస్టు మ్యాచ్ నామ‌మాత్రంగా మారింది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-2025లో ఫైన‌ల్ చేరుకోవాలంటే ప్ర‌తి మ్యాచ్ గెల‌వ‌డం ముఖ్య‌మైన‌దే కావ‌డంతో బీసీసీఐ ఎలాంటి ప్ర‌యోగాలు చేసేందుకు సిద్ధంగా లేదు. ఈ క్ర‌మంలో ఐదో టెస్టు మ్యాచ్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించింది.

తొలి టెస్టు మ్యాచ్‌లో కండ‌రాల గాయం బారిన ప‌డ్డ కేఎల్ రాహుల్ ఇంకా కోలుకోక‌పోవ‌డంతో అత‌డు ఐదో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో లేడ‌ని బీసీసీఐ తెలిపింది. త్వ‌ర‌లోనే అత‌డు లండ‌న్‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలిపింది. ఇక రాంచీ టెస్టుకు విశ్రాంతి నిచ్చిన జ‌స్‌ప్రీత్ బుమ్రా ధ‌ర్మ‌శాల‌ టెస్టులో బ‌రిలోకి దిగ‌నున్నాడు. అదే స‌మ‌యంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను జ‌ట్టు నుంచి విడుద‌ల చేసింది.

Yashasvi Jaiswal : ఐదో టెస్టుకు ముందు య‌శ‌స్వి జైస్వాల్‌ను ఊరిస్తున్న రికార్డులు

మార్చి 2న ముంబై, త‌మిళ‌నాడు జ‌ట్ల మ‌ధ్య రంజీ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ లో త‌మిళ‌నాడు త‌రుపున బ‌రిలోకి దిగేందుకు అత‌డిని విడుద‌ల చేసింది. ఒకవేళ అత‌డి అవ‌స‌రం ఉంది అని అనుకుంటే ఈ మ్యాచ్ ముగిసిన త‌రువాత‌ మ‌ళ్లీ అత‌డు జ‌ట్టుతో క‌ల‌నున్నాడ‌ని తెలిపింది.

5వ టెస్టు కోసం భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్‌), జ‌స్‌ప్రీత్‌ బుమ్రా (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), కేఎస్‌ భరత్ (వికెట్ కీప‌ర్‌), దేవదత్ పడిక్కల్, ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మ‌హ్మ‌ద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

Shreyas Iyer : పురుషుల జ‌ట్టు నుంచి తొల‌గించార‌ని.. మ‌హిళ‌ల లీగ్‌లో అంపైరింగ్ చేస్తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ?