బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించిన ఇషాన్ కిషన్.. అందుకే ఇలా?

టెస్ట్ సిరీస్‌లో ఆడడానికి బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను ఇషాన్ కిషన్ తిరస్కరించాడని..

బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించిన ఇషాన్ కిషన్.. అందుకే ఇలా?

Ishan Kishan

Ishan Kishan: బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి శ్రేయాస్ అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను తప్పించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ గురించి ESPN cricinfo ఓ విషయం తెలిపింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడడానికి బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను ఇషాన్ కిషన్ తిరస్కరించాడని చెప్పింది.

వ్యక్తిగత కారణాల వల్ల ఇషాన్ కిషన్ కొంత కాలం విశ్రాంతి కావాలని అడిగినట్లు వివరించింది. అయినప్పటికీ, ఇషాన్ కిషన్ సొంతంగా ప్రాక్టీసు చేసుకుంటున్నాడని చెప్పింది. నేషనల్ క్రికెట్ అకాడమీ, తన ఝార్ఖండ్ యూనిట్‌కి రిపోర్ట్ కూడా చేయలేదని వివరించింది.

కాగా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ వెన్నునొప్పితో బాధపడడంతో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ నుంచి అతడిని బీసీసీఐ ఇంతకుముందే తప్పించింది. ఆ తర్వాత.. రంజీ ట్రోఫీలో అతడు ఆడవచ్చని బీసీసీఐ మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ అతడు రంజీ ట్రోఫీలో ఆడేందుకు అందుబాటులోకి రాలేదు.

కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లు దేశవాళీ టోర్నీల్లో ఆడడాన్ని తప్పనిసరి చేస్తూ బీసీసీఐ నిబంధనలు ఉన్నప్పటికీ శ్రేయాస్ అయ్యర్ రంజీలో ఆడలేదు. ఇషాన్ కిషన్ కూడా ఇదే తీరు కనబర్చడంతో వారిద్దరినీ బీసీసీఐ బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి తప్పించింది.

Also Read: గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం.. యాక్టివ్ పాలిటిక్స్‌కు గుడ్‌బై!