ప్రతి మహిళకు కేజీ బంగారం, ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తానంటారు: మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy: బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని అన్నారు.

ప్రతి మహిళకు కేజీ బంగారం, ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తానంటారు: మంత్రి పెద్దిరెడ్డి

peddireddy ramachandrareddy

ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి మహిళకు కేజీ బంగారం, ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తానని అంటారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పెద్దిరెడ్డి పాల్గొని మాట్లాడారు.

గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని అన్నారు. ఎన్నికల వేళ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు నాయుడు హామీలను నెరవేరుస్తారా అన్నది ప్రజలు ఆలోచించాలని అన్నారు. జగన్ విద్య, వైద్యాన్ని ఎన్నడూ లేని విధంగా తీర్చిదిద్దారని పెద్దిరెడ్డి చెప్పారు. ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని అంటున్న వెంకయ్య నాయుడు, చంద్రబాబు మరి వారి పిల్లలను ఆ మీడియంలోనే ఎందుకు చదివించారని నిలదీశారు.

ఇంగ్లిష్ మీడియంలో వాళ్ల పిల్లలు చదవొచ్చు కానీ.. పేద పిల్లలు చదవ కూడదా అని ప్రశ్నించారు. ప్రజలు చంద్రబాబు నాయుడి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలకు మంచి జరిగితే ఓటు వేయండి అని చెప్పే ధైర్యం వైఎస్ జగన్‌కు ఉందని చెప్పారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని, రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చారని చెప్పారు.

మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.. అంతేకాదు..: డిప్యూటీ సీఎం భట్టి