మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.. అంతేకాదు..: డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka: తెలంగాణలో 2019 ఆగస్టు ఒకటో తేదీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చిన చరిత్ర లేదని విమర్శించారు.

మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.. అంతేకాదు..: డిప్యూటీ సీఎం భట్టి

Bhatti vikramarka

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఆర్థిక ఇబ్బందులు అధిగమించి, ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించామని తెలిపారు.

తెలంగాణలో 2019 ఆగస్టు ఒకటో తేదీ నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చిన చరిత్ర లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు.

ఆరు గ్యారెంటీల హామీల అమలులో అలసత్వం లేకుండా ఉద్యోగులు పారదర్శకంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని భట్టి విక్రమార్క చెప్పారు. తమ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిందని తెలిపారు. ఇప్పటికే తాము గ్రూప్-1, డీఎస్సీ, తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. భవిష్యత్తుల్లోనూ నోటిఫికేషన్లు ఉంటాయని తెలిపారు.

ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు.. 90రోజుల్లోనే హామీలు అమలు చేస్తున్నాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి