Prabhas : ప్రభాస్‌ని ఫోటో తీస్తున్న దిశాపటాని.. ‘కల్కి’ షూట్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారుగా..

కల్కి మూవీ యూనిట్ ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ ని ఇటలీలోని సముద్రం ఒడ్డున ప్రభాస్, దిశా పటానిలతో తెరకెక్కిస్తున్నారు.

Prabhas : ప్రభాస్‌ని ఫోటో తీస్తున్న దిశాపటాని.. ‘కల్కి’ షూట్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారుగా..

Kalki 2898AD Mpovie unit shares a photo of Disha Patani and Prabhas from Italy goes Viral

Prabhas : ప్రభాస్ ‘కల్కి 2898AD'(Kalki) సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా కల్కి తెరకెక్కుతుంది. మహాభారతం నుంచి భవిష్యత్తు వరకు ఈ సినిమాలో చూపించనున్నారు. అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కల్కి 2898AD సినిమా మే 9న రిలీజ్ కాబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు.

అయితే కల్కి మూవీ యూనిట్ ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ ని ఇటలీలోని సముద్రం ఒడ్డున ప్రభాస్, దిశా పటానిలతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ షూటింగ్ సెట్స్ నుంచి మూవీ టీం, టెక్నికల్ వర్కింగ్ ఫోటోలు కొన్ని వచ్చి వైరల్ అయ్యాయి. తాజాగా చిత్రయూనిట్ మరో ఆసక్తికర ఫోటోని పోస్ట్ చేసింది.

Also Read : Harika Narayan : ఏడేళ్ల ప్రేమ.. నిశ్చితార్థం చేసుకున్న బ్యూటిఫుల్ సింగర్..

ఫ్లైట్ లో వెళ్తుండగా దిశా పటాని.. ప్రభాస్ ని తన ఫోన్ లో ఫొటో తీస్తున్న సమయంలో తీసిన ఫోటోని కల్కి టీం తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. డార్లింగ్ పిక్, ఇటలీ డైరీస్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఇక అభిమానులు సినిమా నుంచి ఏదైనా అప్డేట్స్ త్వరగా ఇవ్వమని కోరుతున్నారు.