IND vs ENG 5th Test : ముగిసిన రెండో రోజు ఆట‌

ఐదో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది.

IND vs ENG 5th Test : ముగిసిన రెండో రోజు ఆట‌

IND vs ENG 5th Test

ముగిసిన రెండో రోజు ఆట‌
ధ‌ర్మ‌శాల టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 473 ప‌రుగులు చేసింది. జ‌స్‌ప్రీత్ బుమ్రా (19), కుల్దీప్ యాద‌వ్ (27)లు క్రీజులో ఉన్నారు.

ప‌డిక్క‌ల్ హాఫ్ సెంచ‌రీ..
షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 83 బంతుల్లో దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ టెస్టుల్లో త‌న తొలి హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 91 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 400/4. ర‌వీంద్ర జ‌డేజా(5), దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (63) లు క్రీజులో ఉన్నారు.

స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ ఔట్‌.. 
టీ బ్రేక్ అనంత‌రం ప్రారంభ‌మైన మొద‌టి ఓవ‌ర్‌లోనే భార‌త్ వికెట్ కోల్పోయింది. షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్ అందుకోవ‌డంతో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (56; 60బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్‌) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 84.1వ ఓవ‌ర్‌లో 376 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

టీబ్రేక్‌.. 
రెండో రోజు టీ బ్రేక్ విరామానికి భార‌త్ మూడు వికెట్లు న‌ష్ట‌పోయి 376 ప‌రుగులు చేసింది. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (44), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (56) లు క్రీజులో ఉన్నారు.

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ హాఫ్ సెంచ‌రీ..
షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 55 బంతుల్లో స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది మూడో హాఫ్ సెంచ‌రీ

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రోహిత్, గిల్ ఔట్‌.. 
లంచ్ అనంత‌రం స్వల్ప వ్య‌వ‌ధిలో భార‌త్ రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ‌(103; 162 బంతుల్లో 13 ఫోర్లు, 3సిక్స‌ర్లు) క్లీన్‌బౌల్డ్ కాగా.. ఆ త‌రువాతి ఓవ‌ర్‌లోనే అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్ (110; 150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) సైతం క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 62.2 ఓవ‌ర్ల‌లో 279 ప‌రుగుల వ‌ద్ద మూడు వికెట్లు కోల్పోయింది.

లంచ్ బ్రేక్‌..
రోహిత్‌, గిల్ లు సెంచ‌రీలు బాదేశారు. రెండో రోజు లంచ్ విరామానికి భార‌త స్కోరు 264/1. గిల్ (101), రోహిత్ (102) లు క్రీజులో ఉన్నారు.

శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ..
షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 138 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అత‌డికి ఇది నాలుగో సెంచ‌రీ. 59 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 262/1. గిల్ (100), రోహిత్ (101) క్రీజులో ఉన్నారు.

రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. టామ్ హార్డ్లీ బౌలింగ్‌లో సింగిల్ తీసి 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అత‌డికి ఇది 12వ శ‌త‌కం.


200 దాటిన భార‌త స్కోరు
భార‌త బ్యాట‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. 45 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 202/1. గిల్ (65), రోహిత్ (76) లు క్రీజులో ఉన్నారు.

గిల్ హాఫ్ సెంచ‌రీ..
మార్క్‌వుడ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 65 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు సాయంతో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

ప్రారంభ‌మైన రెండో రోజు ఆట‌..
ఓవ‌ర్ నైట్ స్కోరు 135 1తో భార‌త్ రెండో రోజు ఆట‌ను ప్రారంభించింది. రోహిత్ శ‌ర్మ‌(52), శుభ్‌మ‌న్ గిల్ (26) క్రీజులో ఉన్నారు.