ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్‌..!

ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియ‌న్స్‌కు గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్‌..!

Suryakumar Yadav

Mumbai Indians-Suryakumar Yadav : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజ‌న్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో ఐదు సార్లు విజేత‌గా నిలిచిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌మ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య సార‌థ్యంలో ఆరోసారి విజేత‌గా నిల‌వాల‌ని భావిస్తోంది. అయితే.. ఐపీఎల్ ఆరంభానికి ముందే ఆ జ‌ట్టుకు గ‌ట్టి షాక్ త‌గిలింది. టీ20 క్రికెట్‌లో నంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్‌, కీల‌క ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్ ఆరంభ మ్యాచ్‌ల‌కు దూరం కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

సూర్య‌కుమార్ యాద‌వ్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధ‌ప‌డుతున్నాడు. కొద్ది రోజుల క్రితం దీనికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో పున‌రావాసం పొందుతున్నాడు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. కాగా..అత‌డు ఐపీఎల్ స‌మ‌యానికి ఫిట్‌గా ఉంటాడా లేదా అన్న దానిపై సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

PSL 2024 : అంపైర్‌తో నీకెందుకు సికింద‌ర్ మామ‌.. మ‌ధ్య‌లో వేలుపెడితివి! ఇప్పుడు చూడు..

‘అతను క‌చ్చితంగా ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇస్తాడు. గుజ‌రాత్ టైటాన్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జరిగే రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఎన్‌సీఏలోని స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇస్తుందా?లేదా? అనేది స్పష్టంగా తెలియదు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపిన‌ట్లు ఆంగ్ల మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

కాగా.. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న గుజరాత్ జెయింట్స్‌తో ఆడ‌నుంది. త‌న రెండో గేమ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మార్చి 27న త‌ల‌ప‌డ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ.. త‌న ఫిట్‌నెస్ పై ఎలాంటి సందేహాలు అక్క‌ర‌లేద‌ని చెప్పాడు. కొన్ని వారాల క్రితం త‌న‌కు హెర్నియా సర్జరీ జరిగిన మాట వాస్తవమేన‌ని, కాలికి ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ని పొందడానికి తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్లు తెలియ‌జేశాడు. అతి త్వ‌ర‌లోనే అంద‌రిని మైదానంలో క‌ల‌వ‌నున్న‌ట్లు చెప్పాడు.

PSL 2024 : మ‌రీ అంత ఎందుకురా అయ్యా.. వికెట్లు నిన్ను ఏమ‌న్నాయ్ చెప్పు.. ఫ‌లితం అనుభ‌వించావుగా