రుతురాజ్ ఆటతీరుపై ఇంగ్లండ్ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ మోర్గాన్ ప్రశంసల జల్లు.. ఏమని వర్ణించాడో తెలుసా?

Ruturaj Gaikwad: ఇంగ్లండ్ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా రుతురాజ్ ప్రదర్శనపై స్పందిస్తూ అతడిని క్లాసీ ప్లేయర్ గా అభివర్ణించాడు.

రుతురాజ్ ఆటతీరుపై ఇంగ్లండ్ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ మోర్గాన్ ప్రశంసల జల్లు.. ఏమని వర్ణించాడో తెలుసా?

Ruturaj Gaikwad

ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎస్కే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచులో 58 బంతుల్లో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇంగ్లండ్ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా రుతురాజ్ ప్రదర్శనపై స్పందిస్తూ అతడిని క్లాసీ ప్లేయర్ గా అభివర్ణించాడు. ఓ ఇంటర్వ్యూలో ఇయాన్ మోర్గాన్ స్పందిస్తూ.. ఈ ఇన్నింగ్స్ రుతురాజ్‌లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పాడు.

టోర్నమెంట్ ఆరంభ మ్యాచుల్లో ఇటువంటి ప్రదర్శన వల్ల నిర్ణయాలు తీసుకునే విషయంలో అతడిపై అతడికి పూర్తి విశ్వాసం కలుగుతుందని, అతడి జట్టుకి మంచి సందేశం పంపుతుందని తెలిపాడు. ‘రుతురాజ్ ఓ క్లాసీ ప్లేయర్.. చాలా కాలం నుంచి అతడిలో ఇటువంటి ప్లేయర్‌ను చూస్తున్నాం’ అని వ్యాఖ్యానించాడు.

టాస్ నుంచి మొదలు పెడితే కెప్టెన్సీ పరంగా అన్ని నిర్ణయాలు తీసుకోవడంలో విజయవంతమయ్యాడని తెలిపాడు. కాగా, ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచులు ఆడిన సీఎస్కే మూడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

Also Read: రుతురాజ్ గైక్వాడ్‌కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల గురించి ధోనీ ఎప్పుడు చెప్పాడో తెలుసా..