Love Me : AIతో పాట పాడించిన ఆస్కార్ విన్నర్ కీరవాణి..

ఆడియో లాంచ్ వంటి పాత సంప్రదాయాన్నితిరిగి తీసుకు రావడంతో పాటు AIతో పాట పాడించి కొత్త ట్రెండ్ తో కూడా వావ్ అనిపిస్తున్న ఆస్కార్ విన్నర్ కీరవాణి.

Love Me : AIతో పాట పాడించిన ఆస్కార్ విన్నర్ కీరవాణి..

MM Keeravaani using AI technology for Love Me songs

Love Me : దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ మూవీ ‘లవ్ మీ’. ఆశిష్ అండ్ వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. కొత్త దర్శకుడు అరుణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, స్టార్ కెమెరామెన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ స్టార్ట్ చేసి టీజర్ అండ్ సాంగ్ రిలీజ్ లతో సందడి చేస్తుంది.

ఈక్రమంలోనే నిన్న ఈ మూవీ ఆడియో లాంచ్ ని ఏర్పాటు చేసారు. ఆడియో లాంచ్ సంప్రదాయం టాలీవుడ్ లో ఎప్పుడో కనుమరుగైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని తీసుకు వస్తూ.. దిల్ రాజు ఈ మూవీ ఆడియో లాంచ్ ని ఏర్పాటు చేసారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో సినిమాకి మొత్తం ఏడు పాటల్ని సమకూర్చారట. ఇక ఏ పాటల్లో ఒక పాటని AI టెక్నాలజీ ఉపయోగించి పాడించారట.

Also read: Tollywood Ugadi Celebrations : అందాల భామల ఉగాది ట్రెడిషనల్ ఫోటోషూట్స్..

ఇప్పటివరకు ఆల్రెడీ పాడిన పాటలనే AIతో మళ్ళీ పాడిస్తూ వచ్చారు. కానీ మొదటిసారి ఒక కొత్త సాంగ్ ని AIతో పాడించడం ఇదే మొదటిసారి. చరిత్రలో ఈ విషయం కీరవాణి పేరు మీద నిలబడిపోతుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. కానీ ఆ పాట ఏంటి అనేది తెలియజేయలేదు. కాగా రిలీజ్ చేసిన సాంగ్స్ అయితే మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

కాగా ఈ మూవీని ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. దెయ్యంతో రొమాన్స్ చేయాలనే కోరికతో హీరో.. దెయ్యాన్ని వెతుకొని వెళ్తాడు. ఇక ఆ తరువాతే జరిగిన కథే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. ఈ స్టోరీ లైన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. మరి థియేటర్స్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.