ఏపీలో టెన్షన్ టెన్షన్.. పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు.. రంగంలోకి అదనపు బలగాలు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిలపై హత్యయత్నం జరిగింది. అర్థరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.

ఏపీలో టెన్షన్ టెన్షన్.. పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు.. రంగంలోకి అదనపు బలగాలు

High Tension Continues In AP

Tension Situation in AP : ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఘర్షణలు తగ్గుముఖం పట్టడంలేదు. పలు జిల్లాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు దాడులకు దిగుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతుంది. ఘర్షణలు జరుగుతున్న పలు ప్రాంతాల్లో పోలీస్ అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read : తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్.. పని మనుషులకోసం స్టేషన్‌కు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి

జమ్మలమడుగులో..
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎర్రగుంట్ల మండలం నిడిజివి గ్రామంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద, జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అదేవిధంగా జమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్దకూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. నేతలను వారివారి గ్రామాలకే పరిమితం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది.

Also Read : ఏపీలో 81.76శాతం పోలింగ్ నమోదు.. జిల్లాల వారిగా పోలింగ్ శాతం వివరాలు వెల్లడించిన ఈసీ

నంద్యాల జిల్లాలో..
నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డోన్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు సీమ సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్యాపిలి మండలం గర్లదిన్నె గ్రామంలో గత శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమంలో ఎస్సీలపై సీమ సుధాకర్ రెడ్డి దాడి చేశారు. అప్పటి వైసీపీలో ఉన్న సుధాకర్ రెడ్డిని బుధవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. అయితే, విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుధాకర్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ ఆందోళన చేయాలని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పూనుకోవడంతో 144సెక్షన్ అమలులో ఉన్నందున ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించారు. దీంతో కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ఇంటికి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు.

ఆళ్లగడ్డలో అర్ధరాత్రి హత్యయత్నం..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై హత్యయత్నం జరిగింది. అర్థరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర నిలుచొని ఉన్న నిఖిల్ ను దుండగులు కారుతో ఢీకొట్టారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. దుండగులు నంద్యాల నుంచి వెహికల్ పై వచ్చినట్లు తెలిసింది. దాడిలో నిఖిల్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో లోకేశ్ పాదయాత్ర సమయంలో ఏవి సుబ్బారెడ్డి పై నిఖిల్ చేయి చేసుకున్నాడు. పాత ఘటన నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డి అనుచరులే నిఖిల్ పై దాడి చేసినట్లు భూమా అఖిలప్రియ వర్గం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read : Cm Revanth Reddy : ఏపీలో షర్మిల గెలుస్తుంది..! ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైనా సరే- ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు

పల్నాడు జిల్లాలో..
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలను గృహనిర్భందం చేశారు. మాచర్ల పట్టణంలో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా దాచేపల్లి మండలం మాదినపాడులో టీడీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. ఆదిరెడ్డి అనే వైసీపీ నాయకుడిపై విచక్షణా రహితంగా ఇనుప రాడ్లతో దాడిచేశారు. ఆదిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం దాచేపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
గురజాల నియోజకవర్గంలో ..
మాచవరం మండలం వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. మాచవరం మండలం వైసీపీ అధ్యక్షుడు చౌదరి సింగరయ్య దారం లక్ష్మిరెడ్డి పై టీడీపీ నేతలు దాడులు చేశారు. మాచవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద కారు ఎక్కుతుండగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులు ఇరువురికి తీవ్ర గాయాలు కాగా, కారు ద్వంసమైంది. గాయపడిన వ్యక్తిని పిడుగురాళ్ల పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.