IPL 2024 : వ‌ర్షం వ‌ల్ల స‌న్‌రైజ‌ర్స్ వ‌ర్సెస్ గుజ‌రాత్ మ్యాచ్ ర‌ద్దైతే.. ఆర్‌సీబీ, సీఎస్‌కేల ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌పై ప్ర‌భావ‌మెంత‌?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ రేసు ఆస‌క్తిక‌రంగా మారింది.

IPL 2024 : వ‌ర్షం వ‌ల్ల స‌న్‌రైజ‌ర్స్ వ‌ర్సెస్ గుజ‌రాత్ మ్యాచ్ ర‌ద్దైతే.. ఆర్‌సీబీ, సీఎస్‌కేల ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌పై ప్ర‌భావ‌మెంత‌?

Rain threatens to wash out SRH vs GT game heres how it will impact CSK vs RCB

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ రేసు ఆస‌క్తిక‌రంగా మారింది. గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ ఫ‌లితం ప్లేఆఫ్స్ రేసుపై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. ఇప్ప‌టికే కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ లు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ (14 మ్యాచుల్లో14 పాయింట్లు, -0.377 నెట్‌ర‌న్‌రేటు), లక్నో సూపర్ జెయింట్స్ (13 మ్యాచుల్లో 12 పాయింట్లు, -0.787నెట్‌ర‌న్‌రేటు) సైతం ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న‌ప్ప‌టికీ వారి నెట్‌ర‌న్‌రేటు మైన‌స్‌లో ఉండ‌డం ప్ర‌తిబంధ‌కంగా మారింది.

Bhuvaneshwar Kumar : భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌కు షాక్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ట్రెంట్ బౌల్ట్ ఒకే ఒక్క‌డు..

ప్ర‌ధానంగా చెన్నై సూపర్ కింగ్స్ (13 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు, +0.528 నెట్‌ర‌న్‌రేటు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు, +0.387నెట్‌ర‌న్‌రేటు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు, +0.406నెట్‌ర‌న్‌రేటు) ల మ‌ధ్యే ఉంది. నేటితో మ్యాచుతో క‌లిపితే.. స‌న్‌రైజ‌ర్స్ రెండు మ్యాచులు ఆడ‌నుంది. క‌నీసం ఒక్క‌మ్యాచులో గెలిచినా, లేదంటే నేటి మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయినా స‌న్‌రైజ‌ర్స్ ప్లే ఆఫ్స్‌లో స్థానం ద‌క్కించుకుంటుంది.

ఆర్‌సీబీ వ‌ర్సెస్‌ చెన్నై..

ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై, ఆర్‌సీబీ పోటీ ప‌డనున్నాయి. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం చిన్న‌స్వామి వేదిక‌గా మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన చెన్నై గెలిస్తే ఎలాంటి స‌మీక‌రణాలు అవ‌స‌రం లేకుండా 16 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.

DC vs LSG : ఏమ‌య్యా గోయెంకా.. పంత్‌ను కౌగిలించుకున్నావ్ స‌రే.. రాహుల్‌తో మ‌ళ్లీ ఏందిది..

ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే చెన్నైతో మ్యాచ్‌లో ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాలి. అది కూడా తొలుత బ్యాటింగ్ అయితే 18 ప‌రుగుల తేడాతో ల‌క్ష్య ఛేద‌న అయితే 18.1 ఓవ‌ర్ల‌లోనే ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్ర‌మే ఆర్‌సీబీ నెట్‌ర‌న్‌రేటు చెన్నై కంటే మెరుగ్గా ఉండి ప్లే ఆఫ్స్ చేరుకుటుంది. ఒక‌వేళ స్వ‌ల్ప తేడాతో ఆర్‌సీబీ గెలిచినా కూడా నెట్‌ర‌న్‌రేటు చెన్నై కంటే త‌క్కువ‌గా ఉంటే అప్పుడు చెన్నై ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.