Manchu Vishnu : మంచు విష్ణు షాకింగ్ ట్వీట్.. కన్నప్ప టీజర్‌ను మనకిప్పుడే చూపించరంట..
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.
Manchu Vishnu – Kannappa : హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, స్టార్ కాస్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం (మే 21) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. టీజర్‌కు మంచి స్పందన వచ్చినట్లు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
‘కేన్స్‌లో కన్నప్ప టీజర్‌ను ప్రదర్శించాము. మంచి స్పందన వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లు, స్థానిక భారతీయులతో పాటు చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. ఇలాంటి రెస్పాన్స్ చూసిన తరువాత ఎంతో సంతోషంగా ఉన్నాను. భారతదేశంలోని ప్రేక్షకుల కోసం టీజర్‌ను జూన్ 13న విడుదల చేయనున్నాం.’ అని మంచు విష్ణు తెలిపారు.
Kajal Aggarwal : ‘ఢీ’ షోలో శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసి చందమామ కాజల్..
ఇక అంతకముందే.. కన్నప్ప ప్రయాణంలో నిరంతరం నాకు మద్దతుగా నిలుస్తూ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో సందేశాలు పంపుతూ నన్ను ఊత్సాహపరిచిన ప్రేక్షకుల కోసం మే 30న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ థియేటర్లో తెలుగు వెర్షన్ టీజర్‌ను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. త్వరలోనే వారందరికీ ఆహ్వానాలు అందుతాయి. కన్నప్ప ప్రపంచాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇక వేచి ఉండలేను అని మంచు విష్ణు అన్నారు.
కన్నప్ప మూవీలో శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటీనటులు భాగస్వామ్యమయ్యారు.
We showcased the teaser of *Kannappa* here in Cannes, and it received an overwhelmingly positive response! International distributors, local Indians, and everyone who saw it absolutely loved it. I am excited and have butterflies in my stomach after witnessing such fantastic… pic.twitter.com/phnLbaKhdY
— Vishnu Manchu (@iVishnuManchu) May 21, 2024