NTR 101 Birth Anniversary : ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు ఘన నివాళి

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.

NTR 101 Birth Anniversary : ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు ఘన నివాళి

Purandeswari Pays

NTR 101 Birth Anniversary : తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని పూలమాలలతో అంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీమంత్రులు మోత్కుపల్లి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కంభంపాటి రామ్మోహనరావు, కాట్రగడ్డ ప్రసూన, బక్కిన నరసింహులు తదితరులు ఉన్నారు.

ఎన్టీఆర్ ఒక శక్తి : దగ్గుబాటి వెంకటేశ్వర్లు
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఒక శక్తి. నవ శకానికి ఆరంభం అయన. ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయం. కొందరికే పరిమితం అయిన రాజకీయాలను అందరు రాజకీయాల్లో రాణించగలరని నిరూపించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. డాక్టర్లను, మేధావులను వివిధ వర్గాలవారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఒక్క ఎన్టీఆర్. రాజకీయాల్లో మకుటంలేని మహారాజు ఎన్టీఆర్. విప్లవాత్మక మార్పులకు ఎన్టీఆర్ నాంది పలికారని వెంకటేశ్వర్లు అన్నారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తాం : దగ్గుబాటి పురందేశ్వరి
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడారు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనంచ చెప్పిన నేత ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ తోనే తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసింది. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే సినీ, రాజకీయ రంగంలో ప్రభంజనం. ఆయన స్పూర్తితో ముందుకు వెళతామని పురందేశ్వరి అన్నారు.

నేను ఎన్టీఆర్ అభిమానిని : రఘురామ కృష్ణరాజు
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు ఎంపీ రఘురామ కృష్ణంరాజు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ విజయం సాధించబోతుందని, ఏడు రోజుల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎన్టీఆర్ అభిమానిని. 1991 ప్రాంతంలో ఎన్టీఆర్ ను కలిసిన సందర్భం.. నా జీవితంలో మధురమైన క్షణాలు. ఎన్టీఆర్ మాదిరి మానవత్వం ఉన్న నేతలు శతాబ్ధంలోనే లేరు. సంక్షేమ రంగానికి సృష్టికర్త ఎన్టీఆర్. రాజకీయాల్లో ఎన్టీఆర్ ది అతిపెద్ద స్థాయి. ఎన్టీఆర్ కు కేంద్రం భారతరత్న ఇచ్చి గౌరవిస్తోందన్న నమ్మకం ఉంది. అంబేద్కర్, పూలే మాదిరి ఎన్టీఆర్ జయంతిని రెండు ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని రఘురామ కృష్ణం రాజు అన్నారు.

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి : కంభంపాటి
టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక.. తెలంగాణలోకూడా తెలుగుదేశం పార్టీకి గౌరవం ఉండేలా చూస్తాం. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.

Also Read : Balakrishna : ఎన్టీఆర్ 101వ జయంతి.. తండ్రికి నివాళులు అర్పించిన బాలకృష్ణ..

Also Read : NTR – Kalyan Ram : 101వ జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..