డిప్రెషన్లో ఉన్న ఈ ఎలుగుబంటి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్
డిప్రెషన్‌తో కనపడుతున్న ఎలుగుబంట్లతో అస్సలు ఫొటోలు తీసుకోవద్దని కోరారు.
డిప్రెషన్లో ఉన్న ఓ ఎలుగుబంటి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో శాంటా రోసా బీచ్ సమీపంలో కొందరు ఆ ఎలుగు బంటితో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశారు. దీనిపై వాల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం స్పందిస్తూ… ఆ ఎలుగుబంటి దగ్గరికి వెళ్లవద్దని, దానితో సెల్ఫీలు తీసుకోవద్దని సూచించారు.
డిప్రెషన్‌తో కనపడుతున్న ఎలుగుబంట్లతో అస్సలు ఫొటోలు తీసుకోవద్దని కోరారు. ఓ ఎలుగు బంటి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ఫొటో చూస్తే తెలుస్తోంది. ఆ ఎలుగుబంటి చెట్టు దగ్గర కూర్చొని కదలకుండా ఉన్న తీరుపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఎలుగు బంటిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. మనుషులతో మృగాలకు ఎల్లప్పుడూ ముప్పు పొంచి ఉంటుందని కొందరు అంటున్నారు. ఆ ఎలుగు బంటి ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Famous last words, “If not friend, why friend shaped?”
Because this black bear is stressed depressed lemon zest.
Walton County Sheriff’s Office deputies are monitoring a bear on the north side of Highway 98 near County Road 83 in Santa Rosa Beach.
Onlookers were trying to… pic.twitter.com/boRdiLucZG
— Walton Co. Sheriff (@WCSOFL) July 18, 2024
Also Read: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు