Prabhas – Sjala Ali : ప్రభాస్ కోసం పాకిస్థాన్ నుంచి ఆ నటి..?
ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ప్రభాస్.
![Prabhas – Sjala Ali : ప్రభాస్ కోసం పాకిస్థాన్ నుంచి ఆ నటి..? Prabhas – Sjala Ali : ప్రభాస్ కోసం పాకిస్థాన్ నుంచి ఆ నటి..?](https://10tv.in/wp-content/uploads/2024/07/sajal-ali.jpg)
Prabhas Hanu Raghavapudi Movie takes Pakisthan Actress Sajal Ali for Important Role Rumours goes Viral
Prabhas – Sjala Ali : ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో భారీ 1000 కోట్ల విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నెక్స్ట్ సినిమాల లైనప్ కూడా భారీగానే ఉంది. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సినిమా అయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ప్రభాస్.
హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ సినిమా తెరకెక్కుతుంది. యుద్ధం నేపథ్యంలో ఉండే ప్రేమకథగా ఈ సినిమా రానున్నట్టు సమాచారం. ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ఉండొచ్చని టాక్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది.
Also Read : Sitara – Mahesh Babu : బర్త్ డే రోజు సితార పాప ఎంత మంచి పని చేసింది.. ఆ అమ్మాయి కోసం ఏకంగా అప్పటివరకు..
హను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ సరసన పాకిస్థాన్ నటిని తీసుకోబోతున్నట్టు సమాచారం. పాకిస్థాన్ కి చెందిన సజల్ అలీ అనే హీరోయిన్ ని ఈ సినిమాలో తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. సజల్ అలీ పాకిస్థాన్ లో సినిమాలు చేస్తున్నా గతంలో బాలీవుడ్ లో శ్రీదేవి ‘మామ్’ సినిమాలో నటించింది. ఇప్పుడు ప్రభాస్ సరసన నటిస్తుందని వార్తలు రాగా దీనిపై మూవీ యూనిట్ కానీ, సజల్ అలీ కానీ స్పందించలేదు. మరి నిజంగానే హను రాఘవపూడి ఈ పాకిస్థాన్ నటిని ప్రభాస్ కోసం తీసుకొస్తాడా చూడాలి.