First Love : బ్రేకప్ స్టోరీతో ప్రైవేట్ ఆల్బమ్.. ‘ఫస్ట్ లవ్’ టీజర్ చూశారా?

దీపు జాను, వైశాలిరాజ్ జంటగా బాలరాజు దర్శకత్వంలో ఫస్ట్ లవ్ అనే మ్యాజికల్ ఆల్బమ్ తెరకెక్కింది. వైశాలిరాజ్ నిర్మించిన ఈ సాంగ్ టీజర్ ని హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు.

First Love : బ్రేకప్ స్టోరీతో ప్రైవేట్ ఆల్బమ్.. ‘ఫస్ట్ లవ్’ టీజర్ చూశారా?

Sid sriram Vaishali raj Song First Love Teaser Released

First Love : ఇటీవల చిన్న చిన్న కాన్సెప్ట్స్ తో ప్రైవేట్ ఆల్బమ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న కథని ఒక సాంగ్ రూపంలో చక్కగా చూపిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లవ్ అనే ప్రైవేట్ సాంగ్ టీజర్ రిలీజయింది. దీపు జాను, వైశాలిరాజ్ జంటగా బాలరాజు దర్శకత్వంలో ఫస్ట్ లవ్ అనే మ్యాజికల్ ఆల్బమ్ తెరకెక్కింది. వైశాలిరాజ్ నిర్మించిన ఈ సాంగ్ టీజర్ ని హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు.

ఈ టీజర్ లో.. ‘ఫస్ట్ లవ్వా.. అతను నీతో చెప్పిన ఫస్ట్ మాట ఏంటి?’ అనే డైలాగ్ తో మొదలై సాంగ్ విజువల్స్ చూపించారు. ‘మనస్సే చేజారే నీ వల్లే.. పతంగై పోయిందే నీ వెంటే.. ఇదంతా కల కాదా..’ అంటూ సాగిన ఈ ప్రోమోని చూస్తుంటే ఇది బ్రేకప్ సాంగ్ అని తెలుస్తుంది. ఆ పాటకు కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ రాయగా సంజీవ్ సంగీత దర్శకత్వంలో సింగర్ సిద్ శ్రీరాం పాడారు. విజువల్స్ కూడా చాలా బాగుండటంతో ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Varun Chakaravarthy : తన డైరెక్షన్‌లో విజయ్ హీరోగా సినిమా తీస్తాను అంటున్న క్రికెటర్..

ఇక ఈ ఫస్ట్ లవ్ సాంగ్ టీజర్ ని హీరో శ్రీవిష్ణు లాంచ్ చేసి మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ సాంగ్ చూశాను. చాలా తక్కువ టైంలో మంచి బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చెప్పారు. కెమరా వర్క్, సిద్ శ్రీరామ్ గారి వాయిస్ చాలా బాగున్నాయి. భూమి ఆకాష్ గా దీపు, వైశాలి పర్ఫెక్ట్ పెయిర్ గా కనిపించారు. డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ ని చూపించాడు. ఈ సాంగ్ మంచి హిట్ అవ్వాలి అని అన్నారు. ఫస్ట్ లవ్ ఫుల్ సాంగ్ జులై 29న విడుదల కానుంది. మీరు కూడా ఈ ఫస్ట్ లవ్ సాంగ్ టీజర్ చూసేయండి..