Ram Charan : RRRలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ చూశారా? ఆ సీన్స్ రిలీజ్ చేయమని రాజమౌళికి ఫ్యాన్స్ రిక్వెస్ట్..

RRR సినిమాలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ నుంచి ఓ వీడియో క్లిప్ వైరల్ గా మారింది.

Ram Charan : RRRలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ చూశారా? ఆ సీన్స్ రిలీజ్ చేయమని రాజమౌళికి ఫ్యాన్స్ రిక్వెస్ట్..

RRR Ram Charan Deleted Scene goes Viral Fans Requesting to Rajamouli for Deleted Scene

Ram Charan Deleted Scene : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తెరకెక్కించిన RRR సినిమా ఏ రేంజ్ భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రపంచవేదికలపై ఎన్నో అవార్డులు గెలుచుకొని ఆస్కార్ కూడా గెలిచి హాలీవుడ్ ప్రశంసలు అందుకుంది RRR సినిమా. హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం RRR సినిమాపై పొగడ్తలు కురిపించారు. అయితే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ ని ఎడిటింగ్ లో కత్తిరించారు.

తాజాగా RRR సినిమా డిలీటెడ్ సీన్ లోని ఓ చిన్న వీడియో క్లిప్ వైరల్ గా మారింది. రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ తీసింది. ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, రానా, ప్రభాస్, కీరవాణి, హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, రసో బ్రదర్స్.. ఇలా అనేకమంది మాట్లాడారు.

Also Read : Allu Arjun : కేరళ వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ విరాళం.. ఎంతంటే..?

ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి పాత ఫోటోలు, వర్కింగ్ స్టిల్స్, మేకింగ్ వీడియోలు చూపించారు. ఈ క్రమంలో RRR సినిమాలోని ఓ చిన్న సీన్ ని కూడా చూపించారు. దీంతో ఆ చిన్న వీడియో వైరల్ గా మారింది. అది సినిమాలో లేని సీన్. RRR సినిమాలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ నుంచి ఈ వీడియో క్లిప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో చరణ్ ఫ్యాన్స్ ఆ డిలీటెడ్ సీన్ ని విడుదల చేయమని రాజమౌళికి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి RRR మూవీ యూనిట్ ఆ డిలీటెడ్ సీన్ ని విడుదల చేస్తుందా చూడాలి. మీరు కూడా ఆ చిన్న వీడియో క్లిప్ చూసేయండి.