Bannu Vasu- Allu Arjun : నా లైఫ్‌లో వాడు ఉన్నాడు.. నా కోసం వాళ్ళ నాన్నకు ఎదురుతిరిగాడు.. బన్నీ గురించి చెప్తూ ఎమోషనల్..

బన్నీ వాసు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Bannu Vasu- Allu Arjun : నా లైఫ్‌లో వాడు ఉన్నాడు.. నా కోసం వాళ్ళ నాన్నకు ఎదురుతిరిగాడు.. బన్నీ గురించి చెప్తూ ఎమోషనల్..

Bunny Vasu Got Emotional while Talking About Allu Arjun

Bannu Vasu- Allu Arjun : నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ కి క్లోజ్ అని తెలిసిందే. ప్రస్తుతం బన్నీ వాసు గీత ఆర్ట్స్ లో నిర్మాతగా ఉన్నారు. బన్నీ వాసు కెరీర్లో అల్లు అర్జున్ ఎంతో సపోర్ట్ చేసాడు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని పలు రూమర్స్ వచ్చాయి. తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చాడు బన్నీ వాసు. నార్నె నితిన్ హీరోగా తెరకెక్కిన ఆయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో బన్నీ వాసు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Bunny Vasu – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా వచ్చి.. ఇప్పుడు ఆయనతో పొలిటికల్ గా నడుస్తున్నాను..

బన్నీ వాసు మాట్లాడుతూ.. నాకు అతనంటే ధైర్యం. నా లైఫ్ లో ఒకడు ఉన్నాడు. నేను ఎక్కడున్నా ఏం చేసినా అతను నా కోసం నిలబడతాడు. ఇటీవల కొన్ని కామెంట్స్ కూడా వింటున్నాను. వీళ్లిద్దరికీ గ్యాప్ వచ్చింది. నాకు, ఆయనకు పడట్లేదు అని అంటున్నారు. ఇవన్నీ వింటూనే ఉన్నాను. నేను కష్టంలో ఉంటే మా అమ్మ, నా స్నేహితుడు బన్నీ మాత్రమే నన్ను గుర్తిస్తారు. నేను అడగక్కర్లేదు. నేను కష్టంలో ఉంటే నా కోసం వస్తాడు. అందుకే నేను అడక్కపోయినా ఆయన మనసులో నాకు ఆయన అవసరం ఉంది అనిపించి ఈ సినిమా ట్రైలర్ షేర్ చేసారు. ఒక స్నేహితుడికి ఎప్పుడు, ఎలా నిలబడాలి తెలిసిన వ్యక్తి అల్లు అర్జున్. 20 ఏళ్ళ క్రితం నేను ఒక తప్పు చేస్తే గీత ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాల్సిన వ్యక్తిని, కానీ అల్లు అర్జున్ అల్లు అరవింద్ కి అడ్డంగా నిలబడి తను ఉంటాడు, ఉండాలి అని చెప్పాడు. నా కోసం వాళ్ళ నాన్నకు ఎదురు నిలబడ్డాడు. ఆయన నా కోసం ఆ రోజు నిలబడకపోతే ఇవాళ బన్నీ వాసు లేడు. నేను ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఆయన బాగుండాలి. నా కోసమే కాదు ఏ ఫ్రెండ్ కోసం అయినా అల్లు అర్జున్ అలాగే నిలబడతాడు అని అన్నారు. దీంతో బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్ అవ్వగా బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ మరోసారి బన్నీని అభినందిస్తున్నారు.